రష్యాపై కార్పొరేట్ యుద్ధం: ఐబీఎం, డెలాయిట్ తెగదెంపులు: నిస్సాన్ కార్ల ఎగుమతులకు బ్రేక్

మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆరంభించిన తరువాత పలు దేశాలు.. రష్యాను వాణిజ్యపరంగా దూరం పెట్టాయి. ఆంక్షలను విధించాయి. నిషేధాజ్ఞలను జారీ చేశాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా సహా యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలన్నీ రష్యాను ఓ రకంగా వాణిజ్య యుద్ధాన్ని సాగిస్తోన్నాయి. చివరికి- విసా, మాస్టర్‌కార్డ్‌ల లావాదేవీలు కూడా రష్యాలో స్తంభించే పరిస్థితి ఏర్పడింది. వైమానిక సంబంధాలపైనా నిషేధాన్ని విధించాయి. రష్యాకు చెందిన విమానాల రాకపోకల కోసం తమ గగనతలాన్ని మూసివేశాయి.

Recommended Video

    Russia Ukraine Conflict : Ukraine - Russia అధ్యక్షులతో కీలక అంశాలపై PM Modi చర్చ! | Oneindia Telugu
    పేపాల్‌ హోల్డింగ్స్‌తో ఆరంభం..

    పేపాల్‌ హోల్డింగ్స్‌తో ఆరంభం..

    పేమెంట్స్ సర్వీసెస్ కంపెనీ పేపాల్ కూడా తన సేవలన్నింటినీ రష్యాలో షట్‌డౌన్ చేసింది. తమ కంపెనీ సర్వీసులు ఏవీ కొంతకాలం పాటు రష్యాలో అందుబాటులో ఉండబోవని పేపాల్ హోల్డింగ్స్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు పాల్పడటాన్ని తాము సమర్థించట్లేదని, రష్యాకు వ్యతిరేకంగా నిలిచిన అంతర్జాతీయ సమాజంతో తాము కూడా జత కలిశామని పేపాల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డ్యాన్ షుల్మన్ తెలిపారు.

    బ్యాంకింగ్ సేవల్లో స్తంభన..

    బ్యాంకింగ్ సేవల్లో స్తంభన..

    పేపాల్ బాటలోనే విసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కూడా నడిచాయి. ఈ మూడు సంస్థలు కూడా రష్యాలో తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు రష్యా సెంట్రల్ బ్యాంక్‌కు సమాచారాన్ని ఇచ్చాయి. రష్యా బ్యాంకులు జారీ చేసిన విసా, మాస్టర్ కార్డులు, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఏ వీ పని చేయబోమని స్పష్టం చేశాయి. తమ నెట్‌వర్క్స్ ఎంతో కాలం పాటు అందుబాటులో ఎండబోవని తేల్చి చెప్పాయి.

    ఐబీఎం.. సర్వీసుల సస్పెన్షన్..

    ఐబీఎం.. సర్వీసుల సస్పెన్షన్..

    దీనికి కొనసాగింపుగా తాజాగా పలు కార్పొరేట్ కంపెనీలు రష్యాతో తెగదెంపులు చేసుకున్నాయి. టెక్ దిగ్గజం ఐబీఎం కీలక ప్రకటన వెలువడించింది. రష్యాలో తమ సర్వీసులన్నింటినీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తోన్న నేపథ్యంలో తాము ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరవింద్ కృష్ణ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రష్యాకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ తనను అడుగుతున్నారని, ఈ నిర్ణయమే వాటికి సమాధానమని చెప్పారు.

    డెలాయిట్ సహా..

    డెలాయిట్ సహా..

    ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగు అకౌంటింగ్ ఫర్మ్స్‌లల్లో ఒకటైన డెలాయిట్ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. రష్యాతో పాటు బెలారస్‌లోనూ తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడున్న సంబంధాలు ఎంతోకాలం పాటు కొనసాగబోవని తేల్చి చెప్పింది. మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడేంత వరకూ రష్యాలో తమ కార్యకలాపాలు ఏవీ అందుబాటులో ఉండవని పేర్కొంది. టాప్ అకౌంటింగ్ ఫర్మ్స్ ఎర్నెస్ట్ అండ్ యంగెస్ట్, ప్రైజ్ వాటర్ కూపర్స్, కేపీఎంజీ సైతం తమ కార్యకలాపాలను స్తంభింపజేశాయి.

    నిస్సాన్ కూడా..

    నిస్సాన్ కూడా..

    ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ కూడా అదే బాటలో నడిచింది. రష్యాకు చేయాల్సిన కార్ల ఎగుమతులన్నింటినీ నిలిపివేసింది. రష్యన్ సినిమా ప్రొడక్షన్ హౌసెస్‌తో కుదుర్చుకున్న కాంట్రాక్ట్‌లకు నెట్‌ఫ్లిక్స్ తాత్కాలికంగా పుల్‌స్టాప్ పెట్టింది. నాలుగు రష్యన్ ప్రాజెక్టులను నిలిపివేసింది. డెడ్‌లైన్, వెరైటీ సిరీస్‌లకు తాత్కాలికంగా స్వస్తి పలికింది. మైక్రోసాఫ్ట్, టిక్‌టాక్, శామ్‌సంగ్, ఎయిర్ బీఎన్బీ, గూగుల్, వోక్స్‌వ్యాగన్, మెర్సిడెజ్ బెంజ్.. ఇదివరకే తమ సర్వీసులను నిలిపివేశాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+