వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్: స్నేహితుడిగా వెళ్ళిన నవజ్యోత్ సింగ్ సిద్ధు

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఎన్నిక ఖరారైపోయింది. శుక్రవారం దిగువ సభలో జరిగిన ఎన్నికల్లో మెజార్టీ సభ్యులు ఇమ్రాన్‌కే మద్దుతు తెలిపారు. పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఈ-ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ అధినేత అయిన ఇమ్రాన్‌కు 176ఓట్లు పడగా, ప్రతిపక్ష పీఎమ్‌ఎల్‌-ఎన్‌ నేత షెహ్‌బాజ్‌కు 96ఓట్లు పడ్డాయి.

స్పీకర్‌ అసాద్‌ ఖైసర్‌ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశాల్లో ఇమ్రాన్‌ ఖాన్ తరఫు సభ్యులకు 'ఏ' లాబీ, షెహబాజ్‌ మద్దతుదారులకు 'బి' లాబీ కేటాయించారు. ఓపెన్‌ బ్యాలెట్‌ పద్దతిన సాగిన ఈ ఓటింగ్‌లో కాసేపు ఉత్కంఠ నెలకొంది. ఒక్కొక్క సభ్యుడు ముందుకు వచ్చి తాము మద్దతివ్వబోయే వారి పేరు చెప్పి వారికి కేటాయించిన లాబీల్లో కూర్చున్నారు. దీంతో ఇమ్రాన్‌కు 176మంది సభ్యుల మద్దతు లభించింది.

Imran Khan confirmed as Pakistan prime minister

ప్రస్తుతం నేషనల్‌ అసెంబ్లీలో పీటీఐ పార్టీకి చెందిన సభ్యులు 152మంది సభ్యులు ఉన్నారు. పీటీఐ పొత్తు పెట్టుకున్న పార్టీల సభ్యులతో కలిపి సభ్యుల సంఖ్య 183కు చేరింది. సాధారణ ఎన్నికల అనంతరం నేషనల్‌ అసెంబ్లీ సభ్యులతో ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవడం ఆనవాయితీ. దీని ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మెజార్టీ ఓట్లు రావాలి.

పార్లమెంట్‌లోని 342 సభ్యులకు గానూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 172 ఓట్లురావాలి. ఇమ్రాన్‌ఖాన్‌కు 176ఓట్లు రావడంతో ఆయనే ప్రధానిగా ఖరారయ్యారు. ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్ శనివారం (ఆగస్టు 18న) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇమ్రాన్‌ ప్రమాణస్వీకారం నేపథ్యంలో పాక్‌ అధ్యక్షుడు మమ్మూన్‌ హుస్సేన్‌ తన స్కాట్లాండ్‌ పర్యటనను వాయిదా వేసుకున్నారు.

పాక్‌కి నవజ్యోత్ సింగ్ సిద్ధు

మాజీ క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్ తన స్నేహితుడని, అందుకే తాను అతని మిత్రుడిగా పాకిస్థాన్ వెళుతున్నట్లు పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధు తెలిపారు. శనివారం పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ తరపున శుభాకాంక్షలు తెలిపేందుకు వెళుతున్నట్లు సిద్ధు చెప్పారు.

English summary
Former cricket star Imran Khan has been elected prime minister of Pakistan in a vote at the country's National Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X