నేడే ఇమ్రాన్ రాజీనామా..!! ర్యాలీలో ప్రకటనకు సిద్దం : అరెస్ట్ కు ముందే..!!

పాకిస్థాన్ ప్రధాని రాజీనామాకు రంగం సిద్దం సిద్దమైంది. ఈ రోజే పాక్ ప్రధాని పదవికి ఇమ్రాన్ ఖాన్ రాజీనామా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇస్లామాబాద్ లో ఇమ్రాన్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ సమయంలోనే ఇమ్రాన్ తన రాజీనామ ప్రకటన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇమ్రాన్ కు వ్యతిరేకంగా పాక్ లో ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానానికి సిద్దమయ్యాయి. ఇదే సమయంలో విదేశీ నిధుల కేసులో ఇమ్రాన్ ను అరెస్ట్ చేస అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇక, తన రాజీనామాతో పాటుగా ముందస్తు ఎన్నికల పైన ఇమ్రాన్ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

2019లో ఆర్మీ చీఫ్‌ పదవీకాలం పొడిగింపుపై తాత్సారం చేయటం వల్ల పాక్‌ సైన్యం ఇమ్రాన్‌పై కోపంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక, దేశంలో నెలకొన్న ఆర్దిక సంక్షోభం.. ద్రవ్యోల్బణం పెరుగుదల కు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ విధానాలే కారణమంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన వందమంది ఎంపీలు అవిశ్వాసం ప్రతిపాదిస్తూ నోటీసులు ఇచ్చాయి. ఈ నెల 28న దీని పైన చర్చ జరగనుంది.

Imran Khan likely to resign in Islamabad rally, may announce key decisions also

ఇదే సమయంలో ఇమ్రాన్ కు సొంత పార్టీకి చెందిన 24 మంది సభ్యులు సైతం ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దుతుగా నిలిచారు. దీంతో.. అవిశ్వాసానికి ముందుగానే రాజీనామా ప్రకటన చేయటంతో పాటుగా.. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లే విధంగా ఇమ్రాన్ ప్రకటన చేసేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది.

అయితే, వార్షిక బడ్జెట్ ప్రతిపాదించిన తరువాత మాత్రమే ఎన్నికలకు వెళ్లాలని పాకిస్థాన్​ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్​ రషిద్ ప్రధానికి సూచించారు. ఇమ్రాన్ పైన విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన తరువాత ప్రజల్లో ఇమ్రాన్ కు మద్దతు పెరిగిందని అంచనా వేస్తున్నారు. అయితే, రాజకీయంగా నెలకొన్న అనిశ్చితికి ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లటమే మార్గమమని ప్రధాని భావిస్తున్నారు. దీంతో.. ఈ రోజు ఇస్లామాబాద్ లో జరిగే ర్యాలీలో ఇమ్రాన్ ప్రసంగం.. అందులో చేసే ప్రకటనల పైన ఆసక్తి నెలకొని ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+