షాకింగ్:ఇమ్రాన్ హత్యకి భార్య రెహామ్ కుట్రపన్నిందా?
కరాచీ: పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పిటిఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన మాజీ భార్య రెహామ్ ఖాన్ విష ప్రయోగం ద్వారా చంపాలని భావించిందా? తద్వారా రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని ప్రణాళిక వేసిందా? అంటే కావొచ్చునని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇటీవల ఇమ్రాన్ ఖాన్ - రెహామ్ ఖాన్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. రెహామ్ ఖాన్ కుట్ర వల్లనే ఇద్దరి మధ్య ఘర్షణ వచ్చిందని, తత్ఫలితంగా తలాఖ్ వరకు వ్యవహారం వెళ్లిందని తాజాగా వార్తలు వస్తున్నాయి. చివరకు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇమ్రాన్‌ను ఆయన సన్నిహితుల ద్వారా హెచ్చరించాయని తెలుస్తోంది.
రెహామ్ ఖాన్‌కు విడాకులు ఇచ్చిన నేపథ్యంలో పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రముఖ జర్నలిస్ట్ ఆరిఫ్ నిజామి స్థానిక మీడియాతో మాట్లాడాడు. సంచలన వ్యాఖ్యలు చేశాడు. వాళ్లిద్దరు పరస్పరం అంగీకారంతో విడాకులు తీసుకున్నారన్న వార్తలను తోసిపుచ్చాడు.

పార్టీ వ్యవహారాలను తనకు చెప్పవలసిందిగా రెహామ్ ఇబ్బంది పెట్టిందని, ఈ నేపథ్యంలో ఘర్షణ జరిగిందని చెప్పాడని తెలుస్తోంది. ఆమెను లండన్ సమావేశానికి పంపించి, ఈ మెయిల్ ద్వారా విడాకులు ఇచ్చాడని తెలిపారు. ఇమ్రాన్ జీవితాన్ని రెహామ్ ఖాన్ నరకంగా మార్చిందని చెప్పాడని తెలుస్తోంది.
మరోవైపు, ఇమ్రాన్ ఖాన్, రెహామ్ ఖాన్ విడాకుల విషయంలో తాను కీ రోల్ పోషించానన్న ఆరోపణలను జహంగీర్ తారన్ తోసిపుచ్చారు. వారిద్దరి మధ్య వ్యక్తిగత ఘర్షణే కారణమని చెప్పారు. కాగా, ఇమ్రాన్ ఖాన్, రెహామ్ ఖాన్ డైవోర్స్ తీసుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications