వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంగారకుడిపై మరో అద్భుతం- కార్బన్‌ డయాక్సైడ్‌ నుంచి ఆక్సిజన్ తయారీ- సరికొత్త చరిత్ర

|
Google Oneindia TeluguNews

అంగారకుడిపై ప్రయోగాల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా పంపిన పర్‌సీవరెన్స్‌ రోవర్‌ అద్భుతాల జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే విజయవంతంగా అంగారకుడిపై కాలుమోపడంతో పాటు తనతో పాటు తీసుకెళ్లిన హెలికాఫ్టర్‌ను ఎగరేసిన మార్స్‌.. ఇప్పుడు మరో ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించింది. అంగారకుడిపై ఉన్న కార్బన్ డయాక్సైడ్‌ను తీసుకుని దాన్ని ఆక్సిజన్‌గా మార్చి అంతరిక్ష ప్రయోగాల చరిత్రలోనే కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.

అంగారకుడిపై అద్భుతాలు

అంగారకుడిపై అద్భుతాలు


ఒకప్పుడు అంగారక గ్రహంపైకి వెళ్లాలంటే, ప్రయోగాలు చేయాలంటేనే ఏం జరుగుతుందో తెలియక ప్రపంచ దేశాలు మథనపడిన పరిస్దితి నుంచి ఇప్పుడు అక్కడ కాలు మోపడమే కాకుండా రోజుకో అద్భుతం చేస్తూ మిషన్‌ మార్స్‌ చరిత్ర సృష్టిస్తోంది. అమెరికా అంతరిక్ష పరిశోదన సంస్ధ నాసా పంపిన పర్‌సీవరెన్స్‌ రోవర్‌ అంగారకుడిపై నుంచి హైడెఫినిషన్‌ ఫొటోలు, వీడియోలు పంపడమే కాకుండా అక్కడ ఏం జరుగుతుందో కట్టకు కట్టినట్లు వివరిస్తోంది. తాజాగా హెలికాఫ్టర్‌ను ఎగరేసి చరిత్ర సృష్టించిన నాసా ఇప్పుడు రోవర్‌తో ఆక్సిజన్ తయారు చేయించి మరో చరిత్ర సృష్టించింది.

అంగారకుడిపై ఆక్సిజన్ తయారీతో చరిత్ర

అంగారకుడిపై ఆక్సిజన్ తయారీతో చరిత్ర

అంగారకుడిపై ప్రయోగాలు నిర్వహించేందుకు పంపిన పర్‌సీవరెన్స్‌ మార్స్‌ రోవర్‌ అక్కడ కార్బన్‌ డయాక్సైడ్‌ ఉన్నట్లు ముందుగా గుర్తించింది. దీంతో ఈ కార్బన్ డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చేందుకు ఉన్న అవకాశాల్ని నాసా పరిశీలించింది. అన్నీ కుదరడంతో కొంత కార్బన్‌ డయాక్సైడ్‌ను తీసుకుని ఆక్సిజన్‌గా మార్చింది. దీంతో భూమి తర్వాత మరో గ్రహంపై మానవ నివాసానికి చేస్తున్న ప్రయోగాల్లో ఇదో కీలక మలుపు కాబోతోంది.

 5 గ్రాముల ఆక్సిజన్‌ తయారైందిలా...

5 గ్రాముల ఆక్సిజన్‌ తయారైందిలా...

పర్‌సీవరెన్స్‌ మార్స్ రోవర్‌ కుడి చేతి వైపు లోపల కారు బ్యాటరీ సైజులో ఓ యాంత్రిక యూనిట్‌ను పంపారు. ఇందులోనే ఆక్సిజన్‌ తయారీ యూనిట్‌ ఉంటుంది. విద్యుత్‌తో పాటు రసాయనిక ప్రక్రియ ద్వారా కార్బన్ డయాక్సైడ్‌ అణువులను వేరు చేసి ఆక్సిజన్‌ను ఇది తయారు చేసింది. ఓ కార్బన్ అణువుతో పాటు రెండు ఆక్సిజన్ అణువులతో ఆక్సిజన్‌ వెలువడింది. ఇందులో అనుబంధ ఉత్పత్తిగా కార్బన్ మోనాక్సైడ్ కూడా తయారైంది. దీంతో ఐదు గ్రాముల ఆక్సిజన్ తయారైంది. ఇది 10 నిమిషాల పాటు మనిషి ఊపిరి పీల్చుకునేందుకు ఉపయోగపడుతుందని అంచనా. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇకపై గంటకు 5 గ్రాముల ఆక్సిజన్ తయారు చేయబోతున్నారు. ఈ ప్రయోగాల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్ని సైతం తట్టుకునేలా ఈ ఆక్సిజన్ యూనిట్‌ను తయారు చేశారు.

అంగారకుడిపై మానవ నివాసంపై ఆశలు

అంగారకుడిపై మానవ నివాసంపై ఆశలు


అంగారకుడిపై 96 శాతం ఉన్న కార్బన్‌ డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చేందుకు నాసా పర్‌సీవరెన్స్‌ రోవర్‌ వేసిన తొలి అడుగు విజయవంతం కావడంతో ప్రపంచ దేశాలన్నీ దీన్ని ఉత్కంఠగా గమనిస్తున్నాయి. అంగారకుడిపై మానవ నివాసానికి యోగ్యమైన పరిస్ధితులను సృష్టించే క్రమంలో ఇదో గొప్ప ముందడుగుగా ప్రపంచ దేశాలు అభివర్ణిస్తున్నాయి. పర్‌సీవరెన్స్‌ రోవర్‌ తాజాగా చేసిన హెలికాఫ్టర్‌ ప్రయోగంతో పాటు ఆక్సిజన్ సృష్టితో నాసాపైనా ప్రశంసల జల్లు కురుస్తోంది. రోవర్‌ మరిన్ని ప్రయోగాలు నిర్వహించడం ద్వారా మానవ నివాసానికి అంగారకుడు కూడా యోగ్యమైన గ్రహమే అని నిరూపణ అయితే మానవ పరిణామ చరిత్రలో ఇదే గొప్ప మలుపుగా నిలిచిపోనుంది.

English summary
The Perseverance rover has converted some carbon dioxide from the Martian atmosphere into oxygen, the first time this has happened on another planet, the space agency said Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X