ఒళ్లుగగుర్పొడిచేలా: మాల్‌లో పరుగెత్తుతూ షార్క్‌లు ఉన్న ట్యాంకులో పడిన యువతి (వీడియో)
బీజింగ్: ఓ యువతి షార్క్ ట్యాంక్‌లో పడిపోయిన టెర్రిఫయింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ ఆమెను షార్క్ ట్యాంక్ నుంచి ఎలాంటి గాయాలు కాకుండా కాపాడారు. ఈ సంఘటన చైనాలోని ఓ మాల్‌లో చోటు చేసుకుంది.
ఈ సంఘటన అక్టోబర్ 15వ తేదీన జియాగ్జింగ్‌లోని వుయూ ప్లాజా మాల్‌లో చోటు చేసుకుంది. మాల్‌లోని సిబ్బంది ట్యాంకులోని షార్క్‌లకు ఆహారం అందించే సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. షార్క్‌లకు ఫుడ్ అందించేందుకు వారు దానిని తెరిచారు. అదే సమయంలో యువతి హడావుడిగా పరుగెత్తుకుంటూ వెళ్లి షార్క్ ట్యాంకులో పడిపోయింది.

షార్క్ ట్యాంకర్ పైనుంచి పరుగెత్తుతూ ట్యాంక్‌లో పడిన యువతి
ఇందుకు సంబంధించిన వీడియో చైనీస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువతి షార్క్ ట్యాంకర్ ఉన్న బ్రిడ్జి పై నుంచి పరుగెడుతోంది. ఆ యువతి అదే మాల్‌లో ఉద్యోగి. అప్పటికే షార్క్‌లకు ఫుడ్ అందించేందుకు తెరిచి ఉంచారు. అలా పరుగెత్తుతున్న ఆమె ఒక్కసారిగా షార్క్ ట్యాంకులో పడిపోయింది.

మీటింగ్ కోసం పరుగెత్తింది
ఆమె అలా పరుగెత్తడానికి కారణం ఆమెకు ఓ మీటింగ్ ఉంది. అందుకే హడావుడిగా షార్క్ ట్యాంక్ బ్రిడ్జి పై నుంచి పరుగెత్తుకుంటూ వెళ్లింది. కానీ తెరిచి ఉంచిన షార్క్ ట్యాంక్‌లో పడిపోయింది. దీంతో అక్కడున్న వారు గాబరాపడ్డారు. ట్యాంకులో పడిన ఆమె కొద్ది క్షణాలు అందులో ఈత కొడుతూ బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేసింది.

ఎలాంటి గాయాలు కాకుండా కాపాడారు
కానీ అదే సమయంలో రెండు షార్కులు (లెమన్ షార్కులు) ఆమె సమీపంలోకి వచ్చాయి. అదే సమయంలో అక్కడకు వచ్చిన సెక్యూరిటీ గార్డులు, మాల్‌లో ఉన్న ఇతరులు ఆమెకు ఎలాంటి గాయాలు కాకుండా కాపాడారు.
మాల్ అధికార ప్రతినిధి ఏం చెప్పారంటే?
ఈ సంఘటనపై సదరు మాల్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ... అది షార్కులకు ఫీడింగ్ సమయమని, అదే సమయంలో ఉద్యోగిని మీటింగ్ కోసం పరుగెత్తుతోందని చెప్పారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆమెను కాపాడారని, ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. ఈ ఏడాది జూన్ నెలలో ఓ ఇన్‌స్టాగ్రామ్ మోడల్ షార్కులతో కలిసి ఈత కొట్టారు. ఆ సమయంలో ఓ షార్క్ ఆమె చేతిని కరచింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications