భారత్‌ది ఓ విజయగాథ: అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ కొత్త మంత్రి బ్లింకెన్‌ కీలక వ్యాఖ్యలు

వలసదారులకు పెద్ద పీట వేస్తూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇంకాసేపట్లో కేబినెట్ కూర్పు, కీలక నియామకాలు చేపట్టనున్నారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్, 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ బుధవారం వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవంతిలో ప్రమాణస్వీకారాలు చేశారు. బైడెన్ బాధ్యతలు చేపట్టడానికి కొద్ది గంటల ముందే.. అమెరికా విదేశాంగ కార్యదర్శిగా ఆయన ఎంచుకున్న ఆంటోనీ బ్లింకెన్.. భారత్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

అమెరికాతో భారత్‌ కొనసాగిస్తున్న సంబంధాలపై ఆ దేశానికి కాబోయే విదేశాంగ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్‌ ప్రశంసలు కురిపించారు. ఏ పార్టీ అధికారంలో ఉందనే దానితో సంబంధం లేకుండా అమెరికాతో భారత్‌ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోందని, ఈ విషయంలో భారత్‌ది ఓ విజయగాథగా చెప్పుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

India is a bipartisan success story: Secretary of State-designate Antony Blinken

జోబైడెన్ నాయకత్వంలో భవిష్యత్తులోనూ ఇరు దేశాల మధ్య మైత్రి కొనసాగాలని బ్లింకిన్ ఆకాంక్షించారు. విదేశాంగ సెక్రటరీగా సెనేట్‌ కమిటీ ఆయనకు ఆమోదముద్ర వేసే ముందు ఆయన మాట్లాడుతూ భారత్‌పై తన దృక్పథాన్ని ఆవిష్కరించారు. ఒబామా హయాంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయని గుర్తుచేశారు. సమాచార మార్పిడి, రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్ల విషయంలో కొత్త ఒప్పందాలు కుదిరాయన్నారు.

ఇండో-పసిఫిక్‌ వ్యూహాన్ని ఆవిష్కరిస్తూ ట్రంప్‌ అదే పరంపరను కొనసాగించారని, ప్రాంతీయంగా భారత్‌ సార్వభౌమాధికారంపై చైనా సహా ఇతర ఏ శక్తులు సవాల్‌ విసరకుండా కృషి చేస్తున్నామని, ఉగ్రవాద నిర్మూలనపైనా ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని బ్లింకిన్ చెప్పారు. వాతావరణ మార్పుల అంశంలో పురోగతి సాధించాల్సి ఉందని, భారత ప్రధాని మోదీ పునరుత్పాదక ఇంధనం సహా ఆధునిక సాంకేతికతను ప్రోత్సహిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+