భారత్-రష్యా కొత్త ప్లాన్‌తో పాకిస్థాన్‌కు బిగ్ షాక్!

India-Russia: భారత్, రష్యాలు తమ వైమానిక రక్షణ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. రెండు దేశాల మధ్య తదుపరి తరం యుద్ధం విమానాల(నెక్ట్స్ జనరేషన్ ఫైటర్ జెట్స్) తయారీకి సంబంధించి కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భారత్‌కు చెందిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) ధ్రువీకరించింది.

నూతన యుద్ధ విమానాల తయారీ కోసం రష్యాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్ఏఎల్ ప్రతినిధి వెల్లడించారు. MIG-21 నుంచి Su-30MKI ఫైటర్ జెట్ల వరకు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉమ్మడి సహకారాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ బంధాన్ని కొత్త రంగాలకు, ముఖ్యంగా ఐదో తరం స్టెల్త్ ప్లాట్‌ఫారమ్‌లు (Su-57) వంటి వాటికి విస్తరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని హెచ్ఏఎల్ అధికారి స్పష్టం చేశారు.

India-Russia to Co-Develop Next-Gen Fighter Jets Big Blow to Pakistan

భారత్, రష్యా సంబంధాలకు కొత్త ఉత్సాహం
రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు హెచ్ఏఎల్ ప్రతినిధి సమాధానమిస్తూ.. "రష్యాతో కలిసి పనిచేయడం మాకు చాలా సౌకర్యంగా ఉంది. మా వైపు నుంచి ఎటువంటి సమస్య లేదు. MIG-21, Su-30MKI యుద్ధ విమానాల ఉమ్మడి ఉత్పత్తి ద్వారా ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఏర్పడ్డాయి." అని అన్నారు. రష్యా నిపుణులు తమకు చాలా సహాయం చేస్తున్నారని, తాము యాక్టివ్‌గా అనుభవాన్ని పంచుకుంటున్నామని ఆయన తెలిపారు.

హెచ్ఏఎల్-రష్యా భాగస్వామ్యం నేపథ్యం
భారత వైమానిక దళం (IAF) తమ యుద్ధ విమానాల ఆధునికీకరణపై సీరియస్‌గా దృష్టి సారించిన సమయంలో ఈ కీలక ముందడుగు పడింది. వైమానిక దళంలో స్క్వాడ్రన్ల కొరత, పెరుగుతున్న ప్రాంతీయ భద్రతా ముప్పు నేపథ్యంలో ఈ భాగస్వామ్యం మరింత కీలకంగా మారింది. కోల్డ్ వార్ సమయంలో భారత్‌కు తొలి సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ మిగ్-21తో ఈ భాగస్వామ్యం మొదలైంది. దీనిని రష్యా లైసెన్స్ కింద బెంగళూరు, నాసిక్‌లోని హెచ్ఏఎల్ ప్లాంట్లలో అసెంబ్లింగ్ చేశారు. 1990ల చివర్లో Su-30MKI కార్యక్రమం రూపంలో ఈ సహకారం అభివృద్ధి చెందింది. ఇప్పటివరకు 270 కంటే ఎక్కువ యూనిట్లను తయారు చేశారు. ఇవి భారత వైమానిక దళానికి వెన్నెముకగా ఉన్నాయి.

ప్రస్తుతం హెచ్ఏఎల్ నాసిక్ ప్లాంట్‌లో మరో 15 అదనపు Su-30MKI జెట్లను ఉత్పత్తి చేసేందుకు ఒక ఒప్పందం ఉంది. వీటి డెలివరీ 2026 నాటికి పూర్తి కావాల్సి ఉంది. వీటిలో ఎయిర్‌ఫ్రేమ్ నుంచి ఇంజిన్ వరకు 60 శాతం కంటే ఎక్కువ భాగాలు ఇండియాలోనే తయారవుతున్నాయి. ఇది మేక్ ఇన్ ఇండియాకు చాలా ముఖ్యం. అంతేకాకుండా హెచ్ఏఎల్ ఇప్పటికే ఉన్న విమానాలను 'సూపర్ సుఖోయ్' అప్‌గ్రేడ్ పేరుతో ఆధునికీకరిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+