రష్యా నుంచి చమురు దిగుమతి ఆపేస్తే భారత్ కు ఎంత నష్టం..?
భారత్ పై 50 శాతం సుంకాలు విధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనీ చేశారు. అయితే ఇదేదో భారత్ పై ట్రంప్ కు డైరెక్ట్ గా ఉన్న పగ మాత్రం కాదు. ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపాలంటే రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని భావించిన ట్రంప్ ఈ మేరకు పుతిన్ మిత్ర దేశాలపై కన్నెర్ర చేస్తున్నారు. అందులో భాగంగానే రష్యా నుంచి చమురు, ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న భారత్ పై ట్రంప్ భారీగా సుంకాలను పెంచారు. దీంతో భారత్ పై 50 శాతం సుంకాల భారం పడింది. ఇప్పటికే భారత్ వస్తువులపై 25 శాతం టారిఫ్ లు విధించగా.. తాజాగా ప్రకటించిన మరో 25 శాతం సుంకాలు ఈ నెల 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. అయితే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఆగితే సుంకాలు తగ్గొంచని నిపుణులు భావిస్తున్నప్పటికీ ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.
రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకే టారిఫ్ లు విధించినట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం ఆగితే టారిఫ్ లు తగ్గిస్తామన్నారు. ఇప్పటికే రష్యాకు యుద్ధం నిలిపివేయాల్సిందిగా 50 రోజుల అల్టిమేటం జారీ చేశారు. కానీ పుతిన్ తీరులో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆ 50 రోజుల అల్టిమేటం ను 10 రోజులకు కుదించారు. ఉక్రెయిన్ తో యుద్ధం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని.. రష్యాపైన భారీ స్థాయిలో టారిఫ్ లు విధిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో ఆగస్టు 8 తో ట్రంప్ ఇచ్చిన గడువు ముగుస్తుంది. మరోవైపు మరోవైపు భారత వస్తువులపై ట్రంప్ 50శాతం టారిఫ్ లు విధించడం వెనుక ఎటువంటి లాజిక్ గానీ కారణం గానీ లేదని భారత సీనియర్ దౌత్యవేత్త దమ్ము రవి తెలిపారు. టారిఫ్ లు విధించిన తర్వాత కూడా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఇరు దేశాల వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం ఆగస్టు చివరి వారంలో భారత్ ను సందర్శించే అవకాశం ఉందన్నారు.
ఇక అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ లు దేశంలోని 9 రకాల ఉత్పత్తులపై పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల్లో దాదాపు 27 శాతం అమెరికాకు చేరాయి. ఈసారి ఆ విలువ కొంత తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా రొయ్యలు భారీ స్థాయిలో అమెరికాకు ఎగుమతి అవుతాయి. ఈ రంగంపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. అలాగే డైమండ్స్, అపారెల్స్, టెక్స్ టైల్స్, ఆర్గానిక్ ఉత్పత్తులు, స్టీల్ , అల్యూమినియం తదితర వస్తువులపైనా భారం పడే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ ట్రంప్ ఆదేశాలకు తలొగ్గి రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడం ఆపేస్తే భారత్ దిగుమతి బిల్లు 12 బిలియన్ డాలర్లు పెరిగే అవకాశం ఉందని SBI రిపోర్ట్ వెల్లడించింది. 2025-25 ఆర్థిక సంవత్సరంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం భారత్ ఆపేస్తే FY26 లో 9 బిలియన్ డాలర్లు,FY27 లో 11.7 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. అలాగే అన్ని దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం నిలిపివేస్తే చమురు ధరలు 10 శాతం పెరగొచ్చని తెలుస్తోంది.

భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం 2022 నుంచి గణనీయంగా పెంచేసింది. ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి వెస్టర్న్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో రష్యా కు భారత్ దగ్గరైంది. ఆ విధంగా చమురు దిగుమతులను పెంచేసింది. ఈ క్రమంలో భారత్ కు రష్యా డిస్కౌంట్ తో చమురు అమ్మకాలు చేసింది. రష్యా కంటే ముందు భారత్.. ఇరాక్ నుంచి అధికంగా చమురు దిగుమతి చేసుకునేది. ఆ తర్వాత సౌదీ అరేబియా, యూఏఈ దేశాల నుంచీ చమురు దిగుమతి చేసుకునేది భారత్. అయితే ఒకవేళ రష్యాతో చమురు దిగుమతి నిలిపివేసినా భారత్ కు గుయానా, బ్రెజిల్, కెనడా లాంటి చమురు నిక్షేపాలు అధికంగా ఉన్న దేశాలతో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో పెద్దగా ఇబ్బంది ఉండదని SBI రిపోర్ట్ వెల్లడించింది. అయితే రష్యా నుంచి దిగుమతులు తగ్గితే మాత్రం అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరిగి కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని SBI రిపోర్ట్ తేల్చింది.
-
"ఇరాన్ తో యుద్ధం త్వరలోనే ముగిస్తాం" -
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
గ్యాస్, పెట్రోల్, డీజిల్ పై ఏపీ వాసులకు సూపర్ న్యూస్.. మీకు దిగులు లేదు! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!!











Click it and Unblock the Notifications