వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Suella Braverman : లిజ్ ట్రస్ కేబినెట్లో భారతీయురాలు-హోం పదవి- రిషిని కాదని మద్దతిచ్చినందుకే !

|
Google Oneindia TeluguNews

లండన్: బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ బాధ్యతలు చేపట్టారు. తన కేబినెట్లో ఈసారి తనతో ప్రధాని పదవికి పోటీ పడిన ఓ భారతీయురాలికి కూడా చోటిచ్చారు. ప్రధాని పీఠం అధిష్టించాక ప్రకటించిన కేబినెట్ బెర్తుల్లో కీలకమైన హోంశాఖ కార్యదర్శి బాధ్యతల్ని ఆమెకు అప్పగించారు. దీంతో ఇప్పుడు ఆ భారతీయురాలి గురించి అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. దీని వెనుక చాలా కథ ఉంది. ఇంతకీ ఆమె పేరు సుయెల్లా బ్రేవర్ మాన్.

బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్

బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్

బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రిగా లిజ్ ట్రస్ మంగళవారం ఇక్కడ డౌనింగ్ స్ట్రీట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత తన కేబినెట్ సహచరుల్ని కూడా ఎంచుకున్నారు. అయితే ఈసారి లిజ్ ట్రస్ ఎంచుకున్న కేబినెట్ సహచరులపై బ్రిటన్ లో చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం తెల్లవారి కంటే కూడా ఇతరులకే ఎక్కువ పదవులు కేటాయించడమే కాదు ఓ భారతీయ సంతతి కన్వర్వేటివ్ పార్టీ మహిళకు కీలక పదవి అప్పగించడమే. దీంతో ఆ భారతీయురాలి వివరాలు తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు.

భారతీయురాలు సుయెల్లాకు చోటు

భారతీయురాలు సుయెల్లాకు చోటు


లిజ్ ట్రస్ తాజాగా ప్రకటించిన కేబినెట్ బెర్తుల్లో భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్‌మన్‌ కూడా ఉన్నారు. ఆమెతో సహా కొన్ని సీనియర్ క్యాబినెట్ పదవులను లిజ్ ట్రస్ ప్రకటించారు. ఇందుోల కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికలలో నాకౌట్ కావడానికి ముందు ట్రస్‌కు వ్యతిరేకంగా నిలబడిన మాజీ ప్రత్యర్థి అయిన సుయెల్లా బ్రేవర్‌మాన్ ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. లిజ్ ట్రస్ తో పోటీ పడి ఓటమిపాలైన మరో భారతీయుడు రిషి సునాక్ కు చోటు దక్కుతుందా లేదా అన్న ఉత్కంఠకు తెరదింపిన తర్వాత సుయెల్లా చోటు దక్కించుకున్నారు. భారత్ లోని గోవా-తమిళ మూలాలున్న 42 ఏళ్ల బారిస్టర్ అయిన సుయెల్లా కన్జర్వేటివ్ పార్టీలో సభ్యురాలిగా ఉన్నారు.

సుయెల్లాకు హోం బాధ్యతలు

సుయెల్లాకు హోం బాధ్యతలు

లిజ్ ట్రస్ కేబినెట్లో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన థెరీసా కాఫీ ఉప ప్రధానిగా, క్వాసీ క్వార్టెంగ్ ఆర్ధికమంత్రిగా ఎంపికయ్యారు. వీరితో పాటు భారతీయురాలైన సుయెల్లా బ్రేవర్ మాన్ కు హోంశాఖ బాధ్యతలు అప్పగించారు. దీంతో బ్రిటన్ లో హోంశాఖ కార్యదర్శి(మంత్రి)గా సుయెల్లా చరిత్ర సృష్టించబోతున్నారు. అయితే ప్రధాని లిజ్ ట్రస్ సుయెల్లాకు ఇంత కీలక బాధ్యత కట్టబెట్టడం వెనుక తన పట్ల ఆమె చూపిన విధేయతే కారణంగా తెలుస్తోంది. దీని వెనుక ప్రధాని ఎన్నికల సమయంలో జరిగిన పెద్ద కథే ఉంది.

రిషిని కాదని తనకు మద్దతిచ్చినందుకే ?

రిషిని కాదని తనకు మద్దతిచ్చినందుకే ?


తన సొంత పార్టీ కన్జర్వేటివ్ కే చెందిన సుయెల్లా బ్రేవర్ మాన్ కు లిజ్ ట్రస్ హోంశాఖ వంటి కీలక బాధ్యత కట్టబెట్టడం వెనుక ఎన్నికల సమయంలో ఆమె ఇచ్చిన మద్దతే కారణం. తొలుత లిజ్ ట్రస్ కు పోటీగా ఎన్నికల్లో పోటీ పడిన సుయెల్లా గట్టి పోటీ ఇవ్వలేక ఓడిపోయారు. ఆ తర్వాత రిషి సునాక్ కూ, లిజ్ ట్రస్ కూ మధ్య పోటీ జరిగింది. ఇందులో తోటి భారతీయుడైన రిషి సునక్ ను కాదని సుయెల్లా.. లిజ్ ట్రస్ కు అండగా నిలిచారు. ఆమెకు మద్దతుగా ఓట్లు పోలయ్యేలా చేశారు. దీంతో లిజ్ ట్రస్ ప్రధాని కాగానే సుయెల్లాకు తన కేబినెట్లో చోటివ్వడమే కాకుండా హోం బాధ్యత కూడా అప్పగించారు.

English summary
indian orgin conservative leader suella braverman bags home secretary berth in liz truss cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X