''పంది... నీ దేశం వెళ్లిపో": భారత సంతతి సిఈఓపై ట్రంప్ అనుచరులు
భారత సంతతికి చెందిన సిఈఓ రవీన్‌గాంధీపై ట్రంప్ అనుచరుల దూషణలుచార్లెసట్‌విల్లే ఘటనపై ట్రంప్ వైఖరిని తప్పుబట్టిన రవీన్‌గాంధీరవీన్‌ను ఇండియా వెళ్ళిపోవాలని ఆదేశాలు
వాషింగ్టన్: అమెరికాలో భారతీయ సంతతికి చెందిన రవీన్‌గాంధీకి ట్రంప్ మద్దతుదారుల నుండి వివక్షపూరితమైన వ్యాఖ్యలు ఎదురయ్యాయి.ట్రంప్ మద్దతుదారులు రవీన్‌గాంధీని దూషించారు. ట్వీట్లు, పోన్లు, ఈమెయిళ్ళ ద్వారా రవీన్‌పై జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో జరిగిన చార్లెసట్‌విల్లే ఘటనపై ట్రంప్ వైఖరిని వ్యతిరేకిస్తున్నానని జీఎంఎం నాన్‌స్టిక్ కోటింగ్స్ సంస్థకు సీఈఓగా ఉన్న రవీన్ గాంధీ సీఎన్‌బీసీలో ఓ వ్యాసం పోస్ట్ చేశారు.దీంతో ట్రంప్ మద్దతుదారులు రవీన్‌ను దూషించారు. ఈ-మెయిళ్లు, ట్వీట్లు, ఫోన్ కాల్స్ ద్వారా అతన్ని నానా మాటలు అన్నారు. .

ట్రంప్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఆర్థిక వ్యవస్థను ఎంత ముందుకు తీసుకెళ్లినా, చార్లెసట్‌విల్లే ఘటన తర్వాత ఆయనపై నమ్మకం పోయిందని గాంధీ తన వ్యాసంలో పేర్కొన్నారు.తన రంగులో లేని అమెరికన్లపై జరుగుతున్న దౌర్జన్యాలను ట్రంప్ చూసీచూడనట్లు వదిలేయడం సబబు కాదని రవీన్ ఏకీ పారేశారు.
ఈ కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన విధానాలకు ఇక నుంచి మద్దతు తెలిపేది లేదని గాంధీ తన వ్యాసంలో రాశారు.. దీంతో ఆయనపై కొంత మంది ట్రంప్ మద్దతుదార్లు దూషణల పర్వం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తనను పంది...పరదేశీ అంటూ ఫోన్‌కాల్ ద్వారా ఓ యువతి అన్న మాటలను గాంధీ యూట్యూబ్‌లో షేర్ చేశారు. తనను చాలా మంది చెప్పుకోలేని విధంగా దూషించారని గాంధీ మీడియాకు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications