అమెరికాలో భారీ హెల్త్‌కేర్ స్కామ్.. చేసింది భారతీయుడే !!
అమెరికాలో భారీ హెల్త్ స్కామ్ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ కుంభకోణంలో భారత సంతతికి చెందిన మహ్మద్ ఆసిఫ్ అనే వ్యక్తి నిందితుడిగా ఉండడం మరింత సంచలనం సృష్టించింది. ఒక డయాగ్నస్టిక్ ల్యాబ్ మోసానికి సంబంధించి.. మహ్మద్ ఆసిఫ్ దోషిగా తేలడంతో యూఎస్ అటార్నీ చార్లెస్ నైల్ ఫ్లాయిడ్ అతడికి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ స్కామ్‌లో ఆసిఫ్ 1.2 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు ₹10 కోట్లకు పైగా) కుంభకోణానికి పాల్పడినట్లు నిర్ధారించారు.
మెడికేర్ దుర్వినియోగం..
యూఎస్ అటార్నీ ఫ్లాయిడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెడికేర్ (వృద్ధులు, పేదల వైద్య సంరక్షణ కోసం ఉద్దేశించిన ప్రభుత్వ నిధులు) వంటి ముఖ్యమైన వైద్య సంరక్షణ నిధులను పక్కదారి పట్టించి ప్రభుత్వానికి, పన్ను చెల్లించే పౌరులకు తీవ్ర నష్టం కలిగించారని వ్యాఖ్యానించారు. ఆసిఫ్ ఇతరులతో కలిసి నిజంగా ఎటువంటి పరీక్షలు చేయకుండానే నకిలీ బిల్లులు తయారుచేశాడని కోర్టుకు నివేదించారు. కోవిడ్-19 పరీక్షలతో పాటు ఇతర శ్వాసకోశ పరీక్షలు చేయకుండానే, వాటికి సంబంధించిన బిల్లులను మెడికేర్ వ్యవస్థకు సమర్పించి నిధులను స్వాహా చేసినట్టు వివరించారు.

ఈ మొత్తం మోసం వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసిన ఒక డయాగ్నస్టిక్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ద్వారా జరిగినట్టు తెలుస్తోంది. కోర్టు పత్రాల ప్రకారం ఈ ల్యాబ్‌ను 2021లో ఏర్పాటు చేసినప్పటికీ దానికి సంబంధించిన పూర్తి మెడికల్ లైసెన్స్ 2023లో పూర్తయింది. అయితే ల్యాబ్‌కు మెడికేర్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఆసిఫ్ నేతృత్వంలో ఫిర్యాదులు రావడంతో 2025లో ఈ ల్యాబ్‌ను మూసివేశారు. ఆసిఫే ఈ కంపెనీ యొక్క ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించేవాడని అధికారులు గుర్తించారు.
ఈ మోసంలో భాగస్వామ్యం లేని అనేకమంది రోగులు, తాము ఎన్నడూ చేయించుకోని పరీక్షలకు ఛార్జీలు విధించారని ఆరోపించారు. అంతేకాకుండా, చనిపోయిన వ్యక్తుల పేర్ల మీద కూడా నకిలీ బిల్లులు రూపొందించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ మోసంలో తన పాత్రను అంగీకరించిన నేపథ్యంలోనే ఆసిఫ్‌కు జైలు శిక్ష పడింది. అతడిని ఏప్రిల్‌లో చికాగో ఓహేర్ ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కుతుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శిక్షా కాలం పూర్తైన తర్వాత, మహ్మద్ ఆసిఫ్‌ను అమెరికా దేశం నుంచి బహిష్కరించే (Deportation) అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications