భారత సంతతి మావోయిస్టు నేత: 23 ఏళ్లు జైలు
లండన్: బ్రిటన్ లో భారత సంతతికి చెందిన మావోయిస్టు నేత అరవిందన్ బాలకృష్ణన్ (75) సౌత్ వార్క్ క్రౌన్ కోర్టు 23 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. లైంగిక వేధింపులు, అత్యాచారం, సొంత కుమార్తెను అక్రమంగా నిర్బంధించారనే కేసుల్లో దోషిగా తేల్చిన కోర్టు శనివారం ఈ తీర్పు చెప్పింది.
అరవిందన్ బాలకృష్ణన్ బాలుగా పేరొందాడు. అరవిందన్ బాలకృష్ణన్ ఆయన భార్య చందా (69) గతంలో అనుచరులపై లైంగికదాడులు, హింసకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. వివాదాస్పద అరవిందన్ బాలకృష్ణన్ ఆయన భార్య చందాను 2013లో పోలీసులు అరెస్టు చేశారు.

అరవిందన్ బాలకృష్ణన్ సొంత కుమార్తెను 30 సంవత్సరాలు నిర్బంధించారని ఆరోపణలు వచ్చాయి. మొత్తం 25 కేసులు ఆయన మీద నమోదు అయ్యాయి. అయితే అరవిందన్ బాలకృష్ణన్ భార్య చందా మీద నేరం రుజువు కాకపోవడంతో 2015లో ఆమెను విడుదల చేశారు.
అరవిందన్ బాలకృష్ణన్ మీద నేరం రుజువు అయ్యింది. పోలీసులు తగిన సాక్షాలు కోర్టులో సమర్పించారు. సాక్షాలను పరిశీలించిన కోర్టు అరవిందన్ బాలకృష్ణన్ దోషి అని నిర్దారించి శిక్షను విధించింది. ఈ కేసు విషయంపై బీబీసీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications