వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దొంగలకు చుక్కలు చూపించిన ఎన్నారై మహిళ

|
Google Oneindia TeluguNews

లండన్: భారతీయ మహిళలు అంటే ప్రపంచానికే హడలు. ఎందుకంటే మన మహిళా నారీమణులు ఎదురు తిరిగితే ఎవరైనా సరే తోకముడుచుకుని పారిపోవాలి అంతే. ఇలాంటి ఘటన విదేశాల్లో జరిగింది. భారతీయ మహిళ (ఎన్నారై) దెబ్బకు దొంగలు పరారైనారు.

వివరాల్లో్కివెళితే ఇంగ్లండ్ లో భారత సంతతికి చెందిన హేమలతా పటేల్ (57) అనే మహిళ తెగువ చూపి అందరి దగ్గర ప్రశంసలందుకుంటున్నారు. దొంగలను సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాటు చుక్కలు చూపించిన ఆమె ధైర్యాన్ని చూసిన వారి నుంచి మన్ననలు పొందుతున్నారు.

హేమలతా పటేల్ అనే మహిళ అసమాన తెగువతో దొంగలను నిలువరించి చుక్కలు చూపించడంతో పాటు సినిమా చూపించారు. చేషైర్ ప్రావిన్స్ లోని విన్స్ ఫోర్డ్ నగరంలో స్టోర్ లో ఉండగా ముసుగులు ధరించిన దొంగలు కిటికిలోపలికి చొరబడి దొంగతనం చెయ్యడానికి ప్రయత్నించారు.

Indian-origin woman beats back robbers in England

అయితే హేమలతా పటేల్ తో పాటు దుకాణంలో ఉన్న మరో ఇద్దరు మహిళలను కత్తితో దాడి చేస్తామని దొంగలు బెదిరించారు. హేమలతా పటేల్ ఏమాత్రం భయపడకుండా ఆ దొంగలను ఎదిరించారు. సమీపంలో ఉన్న కుర్చీని చేతుల్లోకి తీసుకుని దొంగలను దుకాణం నుంచి బయటకు తరిమికొట్టారు.

ఈ తతంగం అంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఇది జరిగినప్పుడు హేమలతా పటేల్ భర్త దీరుభాయ్ పటేల్, వారి మనవరాళ్లు షాప్ వెనుకవైపు ఉన్నారు. హేమలతా పటేల్ వేసిన కేకలు విని వాళ్లందరూ వచ్చేటప్పటకి అక్కడున్న దొంగలు పారిపోయారు.

నాకేం కాలేదని హేమలతా పటేల్ చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. తాము 33 ఏళ్లుగా ఇక్కడ దుకాణం నిర్వహిస్తున్నామని, గతంలో 2011లోనూ మా షాప్ లో చోరియత్నం జరిగిందని ఆమె చెప్పారు. దుకాణం వెలుపల ఉన్న క్యాష్ మిషన్ ను పగలగొట్టేందుకు దుండగులు విఫలయత్నం చేశారు.

అయితే ఆ సమయంలో తాము షాపులో లేమని స్థానిక పోలీసులు చెప్పారు. తాజాగా చోరీకి ప్రయత్నించిన ఇద్దరు 14, 16 ఏళ్ల బాలురని తాము గుర్తించామని స్థానిక పోలీసులు తెలిపారు. దుండగులను అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేశారని స్థానిక పోలీసులు చెప్పారు. అయితే దొంగలకు చుక్కలు చూపించిన హేమలతా పటేల్ ను స్థానిక పోలీసులు అభినంధించారు.

English summary
Hamalata Patel (57) was confronted by two robbers with faces hidden behind balaclavas while working at her K and L Newsagent store in Winsford, Cheshire, last week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X