అమెరికాలోని షాప్ లో చోరీ.. దొరికిన భారత విద్యార్థులు..!

ఉన్నత చదువులు, ఉపాధి, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లిన భారత్ విద్యార్థులు అక్కడి కఠిన చట్టాలకు బలవుతున్నారు. ఇటీవల కెనడాలోని ఓ రైల్వే స్టేషన్ లో ఓ భారతీయ మహిళ భిక్షాటన చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అలాగే మరో వీడియోలో ఓ యువతి అమెరికాలోని కొన్ని షాపింగ్ మాల్స్ లో చోరీలకు పాల్పడినట్లు తేలడంతో ఆమెను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆమె తనను విడిచిపెట్టాలని పోలీసులను వేడుకుంటున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఇలాంటి ఘటనలు అమెరికాలో అధికంగా జరుగుతున్నట్లు వ్యక్తం అవుతోంది.

తాజాగా అమెరికాలో మరో ఘటన జరిగినట్లు సమాచారం. అమెరికాలోని ఒక షాప్‌ లో దొంగతనం చేస్తూ ఇద్దరు భారతీయ విద్యార్థినులు దొరికిపోయారు. వారిని షాప్ ఓనర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం. తమకు కావాల్సిన వస్తువులను తీసుకొని బిల్లు కట్టకుండా వెళ్లిపోతుండగా షాపు యజమాని వాళ్లను పట్టుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వాళ్లు దోపిడీకి పాల్పడ్డారని నిర్ధారించుకుని అధికారులు అరెస్టు చేసిన ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వారిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి.

Indian Students Arrested for Shoplifting at New Jersey ShopRite

ఇక ఏటా విద్య, ఉపాధి అవకాశాల కోసం భారతీయ విద్యార్థులు అమెరికాకు వెళ్తుంటారు. భారత్ నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య ప్రతి సంవత్సరం మారుతూ వస్తోంది. 2023-24లో అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 3.31 లక్షలకు చేరింది. వారిలో 2023లో గ్రీన్ కార్డ్ పొందిన వారిలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. అలాగే H-1B వీసాలలో 80 శాతం కంటే ఎక్కువ మంది భారతీయలే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+