ముదిరిన వివాదం: కెనడాలో భారత విసా సేవలు రద్దు: ఇప్పట్లో లేనట్టే..!!
ఒట్టావా: భారత్- కెనడా మధ్య విబేధాలు పతాకస్థాయికి చేరుకుంటోన్నాయి. ఈ రెండు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటోన్నాయి. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిర్జర్.. హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ స్వయానా కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో చేసిన ప్రకటన తాలూకు దుమారం ఇంకా తగ్గట్లేదు.
జూన్ 18వ తేదీన ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జార్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కెనడాలో ఈ హత్య చోటు చేసుకుంది. బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో గల గురుద్వారా బయట గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఈ ఘటనలో ఆయన మరణించారు. ఈ హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం ఉందనేది కెనడా చేస్తోన్న ఆరోపణ.

జస్టిన్ ట్రూడో చేసిన ఈ ప్రకటన.. తీవ్రస్థాయిలో విభేదాలు చెలరేగడానికి కారణమైంది. దీన్ని భారత్ తోసిపుచ్చింది. అందులో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ట్రూడో చేసిన ప్రకటనతో తాము విభేదిస్తోన్నామని స్పష్టం చేసింది. ఆయన వద్ద ఉన్న సమాచారం ఏమిటో తమకు తెలియదని పేర్కొంది. భారత్‌లోని కెనడా హైకమిషనర్‌కు కేంద్ర ప్రభుత్వం సమన్లను జారీ చేసింది. సమగ్ర వివరణ కోరింది.
అక్కడితో ఆగలేదు కేంద్ర ప్రభుత్వం. కెనడాలో నివసించే భారతీయులు, విద్యార్థులకు అడ్వైజరీని జారీ చేసింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలహీనపడిన నేపథ్యంలో- అక్కడ నివసించే తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కెనడా వెళ్లే వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరింది. కెనడాలో భారతీయులు, భారతీయ సంస్థలపై దాడి చేసే అవకాశం ఉందని తెలిపింది.
అదే సమయంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది భారత్. కెనడాలో విసా సేవలన్నింటినీ రద్దు చేసింది. కెనడాలో భారతీయుల విసా జారీ ప్రక్రియ వ్యవహారాలన్నింటినీ బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ అనే సంస్థ పర్యవేక్షిస్తోంది. తాజాగా- కెనడాలో భారతీయుల విసా సేవల ప్రాసెస్‌ను నిలిపివేసినట్లు వెల్లడించింది.
ఈ మేరకు ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్ https://www.blsinternational.com/ లో ఈ సమాచారాన్ని పొందుపరిచింది. విసాల ప్రాసెసింగ్ ప్రక్రియను తక్షణమే నిలిపివేస్తున్నట్లు తెలిపింది. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ రద్దు కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీనికి గల స్పష్టమైన కారణాలను వెల్లడించలేదా సంస్థ. ఆపరేషన్ కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరణ ఇచ్చింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications