బట్టలు లేకుండా కొత్త ఏడాది వేడుకలు.. ఎక్కడంటే ??

సాధారణంగా కొత్త ఏడాది వేడుకలంటే రంగురంగుల దుస్తులు, బాణసంచా సందడి కనిపిస్తుంది. కానీ బర్మింగ్‌హామ్‌లోని ఎర్డింగ్‌టన్ ప్రాంతంలో ఉన్న క్లోవర్ స్పా దీనికి భిన్నంగా ఆలోచించింది. ఇది బ్రిటన్‌లోనే అత్యంత అరుదైన మరియు ప్రసిద్ధ నేచురిస్ట్ హోటల్‌గా పేరుగాంచింది. డిసెంబర్ 31 రాత్రి అతిథులు ఎటువంటి దుస్తులు ధరించకుండానే 2026కి స్వాగతం పలికేలా 'న్యూడ్ పార్టీ'ని నిర్వహిస్తోంది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

కాగా హోటల్ యజమాని టిమ్ హిగ్స్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. పార్టీలో అదిరిపోయే డీజే సంగీతం, నృత్యాలు, రుచికరమైన విందు భోజనం ఉండనున్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి కౌంట్‌డౌన్ ముగిసిన తర్వాత సాంప్రదాయ 'ఆల్డ్ లాంగ్ సైన్' (Auld Lang Syne) పాటను పాడటం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అతిథుల కోసం స్టీమ్ రూమ్, సౌనా వంటి స్పా సౌకర్యాలతో పాటు 20 మంది ఒకేసారి ఆస్వాదించగలిగే భారీ 'హాట్ టబ్'ను కూడా సిద్ధం చేశారు.

interesting-details-about-with-out-clothes-new-year-party-for-2026-at-birmingham

కఠినమైన నిబంధనలు..

అయితే ఈ వేడుక కేవలం సామాజిక, స్నేహపూర్వక వాతావరణంలో జరిగే ప్రకృతి సిద్ధమైన కలయిక అని యాజమాన్యం స్పష్టం చేసింది. 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఈ పార్టీకి అర్హులని.. ముఖ్యంగా ఇది కేవలం నేచురిజం (ప్రకృతికి దగ్గరగా ఉండటం) మాత్రమేనని వెల్లడించింది. ఎటువంటి లైంగిక కార్యకలాపాలకు ఇక్కడ అనుమతి ఉండదని హెచ్చరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారిని వెంటనే హోటల్ నుంచి పంపించి వేసేలా కఠిన నిబంధనలు అమలు చేస్తామన్నారు.

బుకింగ్ & ధరల వివరాలు..

ఈ వినూత్న అనుభవాన్ని పొందాలనుకునే వారు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకోవాలి. సాధారణ స్పా డే బుకింగ్ ధరతో పాటు అదనంగా £15 (దాదాపు ₹1,800) చెల్లించి ఈ న్యూ ఇయర్ పార్టీలో పాలుపంచుకోవచ్చు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త ఏడాదిని స్వేచ్ఛగా ఆహ్వానించాలనుకునే నేచురిస్టుల కోసం ఈ హోటల్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

యజమాని టిమ్ హిగ్స్ మాట్లాడుతూ.. నేచురిజం అంటే స్వేచ్ఛ, ఆరోగ్యం, ప్రకృతితో మమేకమవ్వడం అని తెలిపారు. దుస్తులు అనే సామాజిక ఆటంకాలు లేనప్పుడు మనుషుల మధ్య సమానత్వం పెరుగుతుందని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+