Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమెరికా 'యుద్ధ విమానాలు' కాదు అట్ట పెట్టెలు.. మా 'రఫేల్' నయం..!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. నెల రోజులకుపైగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తోంది. మరోవైపు ఇరాన్ ప్రతీకార దాడులను కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచంలోనే శక్తివంతమైన అమెరికా యుద్ధ విమానాల్ని సైతం కుప్ప కూల్చేస్తోంది. దాంతో ప్రపంచ దేశాలు పెద్దన్నగా భావించే అమెరికా రక్షణ రంగం, భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా యుద్ధ విమానాల్నే కూల్చేసిన ఇరాన్.. ఇప్పుడు ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతోంది.

ఇరాన్- అమెరికా మధ్య యుద్ధంలో భాగంగా అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసింది. ఆ తర్వాత యూఎస్ ఏ-10 వార్త్ హోగ్ ఎటాక్ అనే యుద్ధ విమానాన్ని సైతం కువైట్ వద్ద ఇరాన్ తాజాగా కూల్చేసింది. అయితే ఈ ప్రమాదాల్లో ఇద్దరు పైలట్స్ సురక్షితంగా బయట పడగా.. ఒకరి ఆచూకీ మాత్రం గల్లంతు అయింది. ఇలాంటి ఘటనలు అమెరికా ఎయిర్ క్రాఫ్ట్స్ కు జరగడం చాలా అరుదు. 2003 లో అమెరికా ఇరాక్ పై దాడి చేసినప్పుడు అమెరికాకు చెందిన ఓ ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఘటన జరగడం ఆందోళన కలిగించే విషయం.

అయితే రెండు యుద్ధ విమానాలు కుప్పకూలడంపై ట్రంప్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. తాము యుద్దంలో ఉన్నామని.. ఇలాంటి ఘటనలు తమను మరింత దృఢంగా మారుస్తాయని అన్నారు. అలాగే ఇరాన్ తో సంధి చర్చలు కొనసాగుతాయని.. చర్చలు ఆగిపోవడం అనేది జరగదని తేల్చారు. అలాగే యుద్ధ విమానాలు కుప్పకూలడంపై ఆయన ఎక్కువ విషయాల్ని మీడియాకు వివరించేందుకు నిరాకరించారు.

ఇక ఇరాన్‌ గగనతల రక్షణ సామర్థ్యాన్ని ధ్వంసం చేశామని అమెరికా, ఇజ్రాయెల్‌ చెబుతున్నప్పటికీ ఇరాన్ సామర్థ్యంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అంచనాలకు మించి టెహ్రాన్‌ గగనతల రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇరాన్ దాడిలో అమెరికాకు చెందిన మరో రెండు బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్లు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే దాడి జరిగిన వెంటనే అవి ఇరాన్ గగనతలం నుంచి తప్పించుకుని బయటపడినట్లు స్పష్టం అవుతోంది.

Iran Claims to Shoot Down Two US Warplanes Trump Reaction and Rafale vs US Jet Debate Iran US jets

తాజా పరిణామాల మధ్య అమెరికా యుద్ధ విమానాల కంటే ప్రస్తుతం భారత యుద్ధ విమానాలే శక్తివంతమైనవని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మీ ఫైటర్ జెట్స్ కంటే మా రఫేల్ చాలా బెటర్ అని పలువురు కామెంట్స్ పెడుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భారత్ శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిసిన విషయం తెలిసిందే. భారత్ కు చెందిన రఫేల్ ఫైటర్ జెట్స్, ఎస్-400 డిఫెన్స్ వ్యవస్థ గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకున్నాయి. మరోసారి ఇరాన్- అమెరికా యుద్ధం నేపథ్యంలో భారత్ రక్షణ రంగం ఉత్పత్తులపై ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+