మిస్సైళ్లతో విరుచుకుపడుతోన్న ఇరాన్

Iran Israel War: మధ్య- తూర్పు దేశాల్లో మళీ యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్‌పై యుద్ధానికి దిగింది ఇరాన్. ప్రతీకార దాడులకు పాల్పడింది. డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. సరిహద్దుల్లో గల ఇజ్రాయెల్ సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకుని బాంబులను కురిపిస్తోంది. ఈ దాడులపై అమెరికా స్పందించింది. ఇజ్రాయెల్‌పై యుద్ధానికి దిగడాన్ని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ తప్పుపట్టారు.

గత ఏడాది ఇజ్రాయెల్.. పాలస్తీనాపై యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. ఏడు నెలలుగా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదుల స్థావరాలనపై రాకెట్లను సంధించింది. గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షాన్ని కురిపించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 30 మందికి పైగా సాధారణ పౌరులు దుర్మరణం పాలయ్యారు.

Iran has launched missile attack on Israel

ఈ క్రమంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార చర్యలను తీసుకొంది. 200 డ్రోన్లు, మిస్సైళ్లను సంధించింది. ఇరాన్ మిత్రదేశాలు సైతం ఇందులో పాలుపంచుకొన్నాయి. ఇజ్రాయెల్ సైనిక శిబిరాలపై దాడులు నిర్వహించాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ధృవీకరించింది. 200లకు పైగా డ్రోన్లు, మిస్సైళ్లను సంధించినట్లు ఆ దేశ ఆర్మీ ప్రతినిధి చెప్పారు.

సిరియా రాజధాని డమాస్కస్‌లో గల ఇరాన్ రాయబార కార్యాలయం వద్ద కారు బాంబు దాడి ఘటన చోటు చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌పై ఈ ప్రతిదాడి చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాయబార కార్యాలయం వద్ద దాడికి ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ ప్రకటించింది. దీనికి ప్రతీకారాన్ని తీర్చుకుంటామనీ హెచ్చరించింది.

ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ఇరాన్.. చెప్పినట్టే ప్రతీకార చర్యలను తీసుకుంది. ఇజ్రాయెల్‌పై ఎడాపెడా దాడులు సాగించింది. ఆత్మ రక్షణలో భాగంగా తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. దెబ్బకు దెబ్బ తీయాలనే ఉద్దేశంతో ఉన్నామని తేల్చి చెప్పింది. ఈ ఘటన అనంతరం ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేస్తున్నట్లు తెలిపింది.

అటు జోర్డాన్, ఇరాక్, లెబనాన్ తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఎలాంటి వైమానిక రాకపోకలకు అనుమతి ఇవ్వట్లేదని వెల్లడించాయి. ఈ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రయోగించిన డ్రోన్‌లు, క్షిపణులను కూల్చివేసే విషయంలో యుఎస్ బలగాలు ఇజ్రాయెల్‌కు సహకరించాయని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+