ఇజ్రాయెల్ పై యుద్ధానికి కాలు దువ్వుతున్న ఇరాన్-అమెరికాను తప్పుకోమని సూచన..!

ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం మరిన్ని దేశాలకు విస్తరించేలా కనిపిస్తోంది. ఇప్పటికే హమాస్ టార్గెట్ గా పాలస్తీనాపై భీకరదాడులు చేసి వేలాది మందిని పొట్టనబెట్టుకున్న ఇజ్రాయెల్ ను ఇరాన్ కు చెందిన మిలిటెంట్ సంస్ధ హిజ్బొల్లా టార్గెట్ చేస్తోంది. దీంతో ఇరాన్ పై మండిపడుతున్న ఇజ్రాయెల్.. తాజాగా సిరియాలోని ఆ దేశ కాన్సులేట్ పై దాడికి దిగింది. అనధికారికంగా జరిగిన ఈ దాడి ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధానికి తెరతీసేలా కనిపిస్తోంది.

సిరియాలోని ఇరాన్ కాన్సులేట్ పై తాజాగా ఇజ్రాయెల్ కు చెందిన వారు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిపై ఆగ్రహంగా ఉన్న ఇరాన్.. ఇజ్రాయెల్ పై యుద్దానికి సిద్దమవుతున్నట్లు అమెరికాకు సంకేతాలు పంపింది. ఇజ్రాయెల్ పై త్వరలో దాడి చేస్తామని, కాబట్టి ఆ దేశంలో ఉన్న మీ సేనల్ని తప్పించమని అమెరికాను కోరింది. దీనిపై స్పందించిన అమెరికా తమ వ్యవస్దలపై దాడి చేయొద్దని ఇరాన్ ను కోరింది.

Iran Prepares To Attack Israel ask US to Step Aside

ఇజ్రాయెల్ పై దాడి చేయబోతున్నామంటూ ఇరాన్ పంపిన సందేశంపై స్పందించేందుకు అమెరికా నిరాకరిస్తోంది. అయితే ఈ పరిణామాల ప్రభావం తమ దేశంపై పడకుండా దేశంలో తమ సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఇజ్రాయెల్ పై అన్నట్లుగానే ఇరాన్ దాడి చేసే అవకాశాలున్నట్లు అమెరికా అంచనా వేస్తోంది. ఇజ్రాయెల్ లో పౌరుల కంటే సైనిక లేదా గూఢచార లక్ష్యాలే టార్గెట్ గా దాడికి దిగుతుందని అంచనా వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+