Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్

మధ్యప్రాచ్యంలో యుద్ధం ఆగిపోయిందని ప్రపంచం ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఇరాన్ ఒక్కసారిగా బాంబు పేల్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన "ఐదు రోజుల విరామం", "ఉత్పాదక చర్చలు" అన్నీ ఒట్టి భ్రమలని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వాషింగ్టన్‌తో తాము ఎలాంటి చర్చలు జరపలేదని, ట్రంప్ తన ఓటమిని కప్పిపుచ్చుకోవడానికే ఈ 'చర్చల' డ్రామా ఆడుతున్నారని టెహ్రాన్ ఆరోపించింది.

తొకముడిచిన ట్రంప్? ఇరాన్ వెర్షన్ ఇదే!

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) అనుబంధ మీడియా సంస్థలు ట్రంప్ ప్రకటనను ఎద్దేవా చేస్తున్నాయి. ఇరాన్ చేసిన "బ్లాక్ అవుట్" హెచ్చరికలకు అగ్రరాజ్యం వణికిపోయిందని, అందుకే దాడుల నుంచి వెనక్కి తగ్గిందని పేర్కొన్నాయి.

Iran Refutes Trump s Peace Claims No Talks With US Trump Backed Down Out of Fear of Retaliation

ప్రతీకార భయం..

ఇరాన్ విద్యుత్ ప్లాంట్లపై దాడి చేస్తే, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు మరియు మిత్రదేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తామన్న ఇరాన్ హెచ్చరికలే ట్రంప్‌ను ఆలోచనలో పడేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాంతీయంగా జరుగుతున్న చర్చల నుంచి దృష్టి మళ్లించడానికి, తన వైఫల్యాన్ని సమర్థించుకోవడానికి ట్రంప్ 'సమయం' కొంటున్నారని ఇరాన్ విదేశాంగ శాఖ విమర్శించింది.

బిగ్ బ్రేకింగ్: యుద్ధం ఆపేస్తున్నాం. ట్రంప్ సంచలన ప్రకటన
బిగ్ బ్రేకింగ్: యుద్ధం ఆపేస్తున్నాం. ట్రంప్ సంచలన ప్రకటన

ఇరాన్ సైలెంట్ గా ఉంటుందా.. చావుదెబ్బ కొడుతుందా?

ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఇరాన్ తన పట్టు సడలించడం లేదు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును మరింత బిగించే అవకాశం ఉంది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయాలు, సైనిక స్థావరాలపై ఇరాన్ తన ప్రతీకార దాడులను మరింత ముమ్మరం చేయవచ్చు. ఇజ్రాయెల్ మరియు సౌదీ అరేబియాలోని కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా అమెరికా మిత్రదేశాలను ఇరకాటంలో పెట్టాలని టెహ్రాన్ యోచిస్తోంది.

ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు

అగ్రరాజ్యం పరువు గంగలో కలిసినట్టేనా?

అల్టిమేటం ఇచ్చి, డెడ్ లైన్ విధించిన తర్వాత ట్రంప్ ఇలా వెనక్కి తగ్గడం అంతర్జాతీయంగా అమెరికా ప్రతిష్టను దెబ్బతీసేలా ఉంది. "ఆర్ట్ ఆఫ్ ది డీల్" అని చెప్పుకునే ట్రంప్, ఇరాన్ ముందు తలవంచారా? లేక ఇది ఇరాన్‌ను బుజ్జగించి లోబర్చుకోవడానికి వేసిన రహస్య ఎత్తుగడా? అన్నది అస్పష్టంగా ఉంది. అయితే, ఇరాన్ మాత్రం తన 'ఈగో'ను సంతృప్తి పరుచుకుంటూ, అగ్రరాజ్యాన్ని మరింత సవాలు చేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+