ఇజ్రాయెల్ కావాలా ? చర్చలు కావాలా ? 'ట్రంప్ కు ఇరాన్ అల్టిమేటం..!

ఇరాన్ (iran)పై 40 రోజుల దాడుల తర్వాత రెండు వారాల పాటు సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకుని ఈ యుద్దం నుంచి బయటపడ్డామని సంతోషిస్తున్న ట్రంప్ కు ఆ సంతోషం ఎక్కువ కాలం నిలిచేలా కనిపించడం లేదు. దీనికి కారణం ఇజ్రాయెల్. ఇరాన్ తో అమెరికా చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందంపై అసంతృప్తిగా ఉన్న ఇజ్రాయెల్.. ఎలాగైనా దీన్ని నీరుగార్చాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా హెజ్బొల్లా పేరు చెప్పి లెబనాన్ పై దాడులు చేస్తూ ఆ దేశం ఆక్రమణకు ప్రయత్నిస్తోంది. ఇది గ్రహించిన ఇరాన్ రూటుమార్చింది.

పాకిస్తాన్ లో చర్చలకు వెళ్లని ఇరాన్ (iran)

హార్ముజ్ జలసంధిని తెరవాలనే కండిషన్ తో అమెరికా తమతో కుదుర్చుకున్న రెండు వారాల సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇవాళ పాకిస్తాన్ లో ఏర్పాటు చేసిన చర్చలకు వెళ్లకుండా ఇరాన్ షాకిచ్చింది. అమెరికా సీజ్ ఫైర్ ఒప్పందంలో ఇరాన్ తో పాటు దాని మిత్రదేశాలపైనా దాడులు చేయకూడదని నిర్ణయించినట్లు చెబుతోంది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం దీనికి అంగీకరించడం లేదు. ఇరాన్ నే వెనక్కి తగ్గాలని ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ఇరాన్ చేసేది లేక పాకిస్తాన్ లో ఇవాళ జరగాల్సిన చర్చలకు హాజరుకాకుండా దూరంగా ఉండిపోయింది.

Iran Warns Trump End Israel s Barbaric Lebanon Strikes or Face Ceasefire Collapse

లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే !

లెబనాన్‌లో కాల్పుల విరమణ అమలయ్యే వరకు పాకిస్తాన్ లో శాంతి చర్చలు నిలిచిపోతాయని ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ తెలిపింది. అమెరికా అధికారులతో చర్చలు జరిపేందుకు ఇరాన్ సంప్రదింపుల బృందం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌కు చేరుకుందని కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న వాదనలు పూర్తిగా అవాస్తవమని తెలిపింది. లెబనాన్‌లో కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా తన మాటను నిలబెట్టుకునే వరకు, ఇజ్రాయెల్ ప్రభుత్వం తన దాడులను ఆపే వరకు చర్చలు ఆపేస్తున్నట్లు వెల్లడించింది.

Iran Warns Trump End Israel s Barbaric Lebanon Strikes or Face Ceasefire Collapse

నెతన్యాహు కోసం అమెరికాను నాశనం చేసుకుంటారా ?

మరోవైపు నెతన్యాహు పై క్రిమినల్ విచారణ ఆదివారం నాడు తిరిగి ప్రారంభమవుతుందని ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాఘ్చీ ట్వీట్ చేశారు. లెబనాన్‌తో సహా ఈ ప్రాంతంలో కాల్పుల విరమణ, ఆయనను త్వరగా జైలుకు పంపేలా చేస్తుందన్నారు. దౌత్యాన్ని నాశనం చేయడానికి నెతన్యాహును అనుమతించడం ద్వారా అమెరికా తన ఆర్థిక వ్యవస్థను నాశనం చేసుకోవాలనుకుంటే, అది వారికి అంతిమ ఎంపిక అవుతుందన్నారు. అది తెలివితక్కువ పని అని తాము భావిస్తున్నప్పటికీ, దానికీ సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+