Iran War: ట్రంప్ సీజ్ ఫైర్ ప్లాన్ పై తేల్చేసిన ఇరాన్- కీలక ప్రకటన..!
ఇరాన్ (iran)పై తాము ఇజ్రాయెల్ తో కలిసి తాము మొదలుపెట్టిన వార్ ను ముగించడం లేదా కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనపై టెహ్రాన్ స్పందించింది. సీజ్ ఫైర్ కు ట్రంప్ పెట్టిన షరతులపై తాము సమీక్ష జరిపామని, అయితే ఇవి కేవలం అమెరికా-ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం ఉద్దేశించినవే అని తేల్చేసింది. కాబట్టి ట్రంప్ ప్రతిపాదనను తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది. అంతే కాదు అమెరికాతో ఎలాంటి చర్చలు కూడా జరగడం లేదని క్లారిటీ ఇచ్చింది.
పశ్చిమాసియాలో యుద్ధం ముగించేందుకు ట్రంప్ ప్రతిపాదించిన 15 షరతుల్ని ఇరాన్ తోసిపుచ్చింది. వాటిని ఏకపక్షమైనవి, అన్యాయమైనవి అని పేర్కొంది. ఇవి కేవలం అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడతాయని మండిపడింది. పాకిస్తాన్ ద్వారా ఆయా షరతుల్ని అధికారికంగా అందుకున్న తర్వాత.. బుధవారం రాత్రి తాము ఆ ప్రతిపాదనను వివరంగా సమీక్షించామని, అయితే ముందుకు సాగడానికి అవసరమైన ప్రాథమిక షరతులు అందులో లేవని సీనియర్ ఇరాన్ అధికారి ఒకరు రాయిటర్స్‌కు వెల్లడించారు.

సంక్షిప్తంగా చెప్పాలంటే, ఆంక్షలను ఎత్తివేసే ఒక అస్పష్టమైన ప్రణాళికకు బదులుగా, ఇరాన్ తనను తాను రక్షించుకునే సామర్థ్యాన్ని వదులుకోవాలని ఈ ప్రతిపాదన సూచిస్తోందని సదరు అధికారి తెలిపారు. అలాగే అధికారిక చర్చలు ప్రారంభం కాలేదని కూడా తెలిపారు. చర్చలకు ఇంకా ఎలాంటి ఏర్పాటు లేదని, ఈ దశలో చర్చలకు సంబంధించిన ఏ ప్రణాళికా వాస్తవికంగా కనిపించడం లేదన్నారు. అయితే ఈ గ్యాప్ పూడ్చేందుకు, ఇరాన్-అమెరికా మధ్య మధ్యవర్తిత్వానికి టర్కీ, పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నాయి.












Click it and Unblock the Notifications