అరబ్ దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్..! మీ భూభాగాలు వారికి ఇచ్చారో..

ఇజ్రాయెల్ పై హమాస్ దాడులతో ప్రారంభమై ఇప్పుడు పశ్చిమాసియాకు విస్తరించిన పోరు అరబ్ దేశాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా చమురు క్ఱేత్రాలతో అలరారుతున్న ఆయా దేశాలు ఇప్పటివరకూ అమెరికాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయి. కానీ అమెరికా మిత్రదేశం ఇజ్రాయెల్ విషయంలో ఇరాన్ తీసుకున్న దృఢమైన వైఖరిని సమర్థించలేక, అలాగని విమర్శించలేక మౌనంగా ఉండిపోతున్నాయి. ఇదే అదనుగా వారి సాయంతోనే ఇరాన్ ను దెబ్బతీసేందుకు అమెరికా సిద్దమవుతోంది. ఇది గమనించిన ఇరాన్ అరబ్ దేశాలకు ఘాటు హెచ్చరికలు చేసింది.

ముస్లిం దేశాలు, భూభాగాల్ని టార్గెట్ చేస్తున్న ఇజ్రాయెల్ కు హెచ్చరికలు పంపేలా ఇరాన్ చేసిన మిసైళ్ల దాడి అమెరికాను కూడా ఉలిక్కిపడేలా చేసింది. వెంటనే కోలుకుని ఇరాన్ దాడుల్ని తిప్పికొట్టేందుకు ప్రయత్నించినా అప్పటికే కొంత నష్టం జరిగింది. దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూస్తున్న ఇజ్రాయెల్ కు ఇప్పుడు అరబ్ దేశాలు సహకరించేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాతో అవసరాలు ఉన్న అరబ్ దేశాలు ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడికి తమ భూభాగాలు ఇచ్చేలా కనిపిస్తున్నాయి.

iran s big warning to american-friendly arab countries over helping Israel

దీంతో ఇరాన్ వారి విషయంలో ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌పై జరిగే దాడులలో ఇజ్రాయెల్‌కు సహాయం చేయడానికి వారి భూభాగాలు లేదా గగనతలాన్ని ఇస్తే మాత్రం తీవ్ర ప్రతీకారం తప్పదని బెదిరించింది. ఇరాన్ హెచ్చరికలు జారీ చేసిన అరబ్ దేశాల్లో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఖతార్ వంటి చమురు సంపన్న దేశాలున్నాయి. ఇవన్నీ అమెరికా సైనిక దళాలకు ఆతిథ్యం ఇచ్చాయని వాషింగ్టన్ జర్నల్ తాజా నివేదికలో పేర్కొంది.

అమెరికాతో సన్నిహిత అరబ్ దేశాలు తమ భూభాగాల్ని, గగన తలాన్ని ఇరాన్ పై దాడులకు ఇజ్రాయెల్ లేదా అమెరికా వాడుకునేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆయా దేశాలు తమ చమురు కేంద్రాలు ఎప్పటి నుంచో అమెరికా రక్షణలో ఉన్నందున అవి టార్గెట్ కాకుండా ఉండేందుకు వారికి సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇరాన్-ఇజ్రాయెల్ పోరు పెరిగితే ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావం పడటంతో పాటు హోర్ముజ్ జలసంధి గుండా చమురు ఎగుమతులకు అంతరాయం కలుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఇవన్నీ జరగకుండా అమెరికాకు మద్దతిస్తే చాలనుకుంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+