ఇరాన్ చేతిలో బ్రహ్మాస్త్రం- హైపర్ సోనిక్ మిస్సైల్: గంటకు 18 వేల కిలోమీటర్ల వేగం

Hypersonic Missile: ఇజ్రాయెల్‌పై గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ ఎత్తున దాడికి దిగింది ఇరాన్. మిస్సైళ్ల వర్షాన్ని కురిపించింది. లెబనాన్‌లో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా ఈ దాడులకు తెర తీసింది. ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. రాజధాని టెల్ అవివ్ సహా జెరూసలెంలోని అనేక ప్రాంతాలపై అత్యాధునిక క్షిపణులను సంధించింది.

ఈ దాడిని ఇజ్రాయెల్ ధృవీకరించింది. తమ దేశ భూభాగంపై పలు చోట్ల సైరెన్ మోతలు వినిపించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. సైనిక శిబిరాలు, ఎయిర్ బేస్ క్యాంప్‌లు, జనావాసాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు సాగాయని వెల్లడించింది. ఇరాన్ అతి పెద్ద తప్పు చేసిందని, దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదనీ హెచ్చరించింది ఇజ్రాయెల్.

Iran s Hypersonic Missile Fattah 2 hits Israel

ఈ దాడులకు ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2 అని పేరు పెట్టింది. ఇరాన్ క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ ప్రధాన కార్యాలయం తీవ్రంగా దెబ్బతిన్నది. కీలకమైన ఎఫ్- 35 ఫైటర్ జెట్స్ ఎయిర్ బేస్ సైతం ధ్వంసమైందని ఇరాన్ వెల్లడించింది.

తాము ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్‌కు దక్షిణ దిశగా ఉన్న టెల్ నాఫ్‌లో ఉంటుంది మొస్సాద్ ప్రధాన కార్యాలయాన్ని తాకినట్లు తెలిపింది. అలాగే- బీర్‌షేవా సిటీ సమీపంలో ఉండే నెవాటిమ్ ఎయిర్‌బేస్‌ సైతం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపింది. ఎఫ్- 35 ఫైటర్ జెట్స్‌కు ఆదే ప్రధాన కేంద్రం.

తాజా దాడుల్లో ఈ ఎయిర్ బేస్ కూడా ధ్వంసమైనట్లు ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ మహ్మద్ బఘేరి తెలిపారు. దీనితో పాటు నెట్జరిమ్ మిలటరీ ఫెసిలిటీని ధ్వంసం చేసినట్లు చెప్పారు. జులై 31వ తేదీన తమ దేశంలో హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా, ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ అబ్బాస్ నిల్ఫొరౌషన్ దారుణ హత్యకు నిరసనంగానే ఈ దాడులు చేపట్టినట్లు బఘేరి స్పష్టం చేశారు.

ఈ దాడుల కోసం అత్యంత శక్తిమంతమైన హైపర్ సోనిక్ మిస్సైల్‌ ఫతా-2ను ఇరాన్ వినియోగించడం ఉలిక్కి పడేలా చేస్తోంది. ఇజ్రాయెల్‌కు అత్యంత అధునాతన మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఈ హైపర్ సోనిక్‌ను నిలువరించలేకపోయింది. మొస్సాద్, ఎఫ్ 35 జెట్ ఫైటర్స్ ఎయిర్ బేస్ దెబ్బతినడానికి ఈ మిస్సైలే కారణమనే అంచనాలు ఉన్నాయి.

గత ఏడాది జూన్‌లో ఫతా- 1, నవంబర్‌లో ఫతా- 2 మిస్సైల్‌ను అభివృద్ధి చేసింది ఇరాన్. దీని రేంజ్ 1,400 కిలోమీటర్లు. అంటే ఇంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని సైతం ఛేదించే శక్తిసామర్థ్యాలు దీనికి ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో తొలిసారిగా ఈ హైపర్ సోనిక్ మిస్సైల్‌ను పరీక్షించింది. గంటకు 16,052 నుంచి 18,522 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించింది. ఇప్పుడు కూడా అదే వేగంతో ఇజ్రాయెల్‌లో గల తన టార్గెట్లను ఛేదించినట్లు ఇరాన్ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+