ఇర్మాతో పెనువిధ్వంసం! వణుకుతున్న ఫ్లోరిడా, ఖాళీ: తరిమికొట్టేందుకు వినూత్న ఆలోచన

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: హరికేన్‌ ఇర్మా అమెరికా వైపు దూసుకొస్తుంది. కాసేపట్లో ఫ్లోరిడా తీరాన్ని తాకనుంది. కనివినీ ఎరుగని రీతిలో ఇది బీభత్సం సృష్టించనుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఫ్లోరిడాలో పెద్ద ఎత్తున ప్రజలను ఖాళీ చేయించారు. ఫ్లోరిడా, జార్జియా కరోలినా, అలబామాలో అత్యయిక స్థితి. ఫ్లోరిడాలో తీరం దాటే సమయంలో పెను విధ్వంసం సృష్టించే అవకాశముంది.

దాదాపు 6.3 మిలియన్ల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిగిలిన వారు కూడా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఫ్లోరిడా గవర్నర్‌ రిక్‌ స్కాట్‌ సూచించారు. ఇప్పటికే దాదాపు 76 వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

ట్విట్టర్‌లో ట్రంప్ హెచ్చరిక

ట్విట్టర్‌లో ట్రంప్ హెచ్చరిక

ఫ్లోరిడాలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ పెన్స్‌లు అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం విధ్వంసకర తుఫాను ముంచుకొస్తోందని ట్రంప్‌ ట్విటర్‌లో హెచ్చరించారు.

ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు.. ప్రాణాలు పోతే తిరిగిరావు

ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు.. ప్రాణాలు పోతే తిరిగిరావు

ఆస్తి పోతే.. మళ్లీ సంపాదించుకోవచ్చునని, కానీ ప్రాణాలు తిరిగిరావని, వారి భద్రత చాలా ముఖ్యమని ట్రంప్‌ అధికారులకు హితవు పలికారు. వీలైనంత త్వరగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

పెనుగాలుల హెచ్చరిక

పెనుగాలుల హెచ్చరిక

ఇర్మా ప్రభావంతో గంటకు 235 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదముందని నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌ అధికారులు తెలిపారు. 25 సెం.మీ. నుంచి 51 సెం.మీ. మేరకు వర్షపాతం నమోదు కావొచ్చు.

ఇర్మా ఫ్లోరిడాను తాకకుండా వినూత్న ఆలోచన

ఇర్మా ఫ్లోరిడాను తాకకుండా వినూత్న ఆలోచన

ఇర్మా ప్రభావంతో ప్రచండ గాలులతో పాటు సముద్రపు అలలు సాధారణ స్థాయిని మించి ఎగసిపడే అవకాశం ఉన్నందున ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు, ఇర్మా ఫ్లోరిడాను తాకకుండా చేసేందుకు అక్కడి వాసులు వినూత్నమైన ఆలోచన చేపట్టారు.

ఇర్మాను ఇలా తరిమికొట్టేందుకు

ఇర్మాను ఇలా తరిమికొట్టేందుకు

'ప్రతీ ఒక్కరూ మీ ఇంటి బయట ఫ్యాన్లు పెట్టి హరికేన్‌ ఇర్మాను ఫ్లోరిడా నుంచి తరిమెయ్యండి' అని ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. వేలాది మంది ఈ పోస్టును ఫాలో అవుతూ తమ ఇళ్ల బయట ఫ్యాన్లు, హెయర్‌ డ్రైయర్లు వంటి వస్తువులను పెట్టారు. ఫ్యాన్లు పెట్టి ఇర్మాను రాకుండా ప్రయత్నిస్తున్న వారికి సంబంధించిన వీడియోను నౌ దిస్‌ అనే సంస్థ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేసింది. ఈ వీడియో, పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను ఇప్పటి వరకు పది లక్షల మంది వరకు చూశారు. దీంతో అందరూ ఫ్యాన్లను ఇళ్ల ముందు పెట్టారు. ట్విటర్‌లో యునైటెడ్‌వుయ్‌ఫ్యాన్‌ హ్యాష్‌ట్యాగ్‌ చక్కర్లు కొడుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Florida has ordered 6 million people, including thousands of Indian-Americans, to evacuate as massive Hurricane Irma barrelled towards the state after wreaking havoc on the Caribbean islands.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి