ఐఎస్ఐఎస్ ఫైటర్స్ జీతాలు 50% కట్
సిరియా: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థలో పని చేస్తున్న ఫైటర్లకు నాయకులు షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఇస్తున్న జీతాల్లో కనీసం 50 శాతం తగ్గించాలని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద నాయకులు భావించారని వెలుగు చూసింది.
అనూహ్య పరిణామాల వలన ఈ నిర్ణయం తీసుకున్నామని ఐఎస్ఐఎస్ వెల్లడించింది. అయితే జీతాలు తగ్గించడానికి అసలు కారణాలు ఏమిటి అనే విషయం బయటపెట్టలేదు. ఆర్థిక సమస్యల కారణంగా ఇస్లామిక్ స్టేట్ ఈ నిర్ణయం తీసుకునిందని సమాచారం.

జెరూసలెం పోస్టు ఈ వివరాలను వెల్లడించింది. ఇరాక్ లోని మెసుల్ నగరంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఖజానా ఉంది. ఇటీవల ఈ ఖజానా ఉన్న భవనాల మీద అమెరికా సారధ్యంలోని సేనలు వైమానిక దాడులు చేశాయి.
ఈ దాడిలో రూ. కొన్ని లక్షల డాలర్లు కాలిపోయాయని జెరూసలెం పోస్టు వెల్లడించింది. ఈ సందర్బంలో ఐఎస్ఐఎస్ ఫైటర్ల జీతాలు తగ్గించాలని, పన్నుల ద్వారా స్థానిక పౌరుల నుంచి నిధులు వసూలు చెయ్యాలని ఉగ్రవాద సంస్థ నిర్ణయించింది. గత నెలతో పోలిస్తే ఇస్లామిక్ స్టేట్ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని జెరూసలెం పోస్టు వెల్లడించింది.












Click it and Unblock the Notifications