వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసిస్‌కు 46 వేల ట్విట్టర్ ఖాతాలు: ప్రఖ్యాత నగరం ధ్వంసం

|
Google Oneindia TeluguNews

కరుడుకట్టిన రాక్షసులు ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులకు 46 వేల ట్విట్టర్ అకౌంట్లు ముడిపడి ఉన్నాయని వెలుగు చూసింది. 2014 చివరి అంశంలో ఉగ్రవాద సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా (ఐఎస్ఐఎస్)తో 46 వేల ట్విట్టర్ అకౌంట్లు వివిధ దేశాల నుండి అనుసంధానం అయ్యాయని ఓ పరిశోధనలో వెల్లడి అయ్యింది. బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూషన్ శుక్రవారం వారు చేసిన పరిశోధన నివేదిక వెల్లడించింది.

2014 సెప్టంబర్, డిసెంబర్ మద్య కాలంలో 46 వేల ట్విట్టర్ అకౌంట్ లను ఐసిస్ మద్దతు దారులు ఉపయోగించారని గుర్తించారు. ప్రపంచంలో ఐసిస్ మద్దతుదారులు ఎక్కువ మంది సౌధి అరేబియాలో ఉన్నారని స్పష్టం చేశారు. తరువాత సిరియా, ఇరాక్, యూఎస్ (అమెరికా)లో ఉన్నారని తమ పరిశోదనలో తేలిందని చెబుతున్నారు. ఐఎస్ మద్దతుదారులు మూడు వంతులు అరబిక్, ఐదుగురిలో ఒకరు ఇంగ్లీష్ లో ట్విట్ చేసుకున్నారని స్పష్టం చేశారు.

ఐసిస్ చేసిన కిరాతకాలు, వారి కర్యాకలాపాలు ఎప్పటికప్పుడు వీరు ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటున్నారని వెలుగు చూసింది. అదే విదంగా ఐసిస్ చేస్తున్నది మంచి పనే అని వారు ఒకరికి ఒకరి సమాచారం ఇచ్చుకున్నారని వెలుగు చూసింది. అమెరికాలో ఐసిస్ మద్దతుదారులు ఉన్నారని వెలుగు చూడటంతో అక్కడి పోలీసు అధికారులు, సైబర్ పోలీసులు అత్యాధునిక టెక్నాలజి ఉపయోగించి మూతపడిన ట్విట్టర్ అకౌంట్ వివరాలు బయటకు లాగుతున్నారు.

ISIS has 46 thousend tiwttar acounts !

నగరాన్ని ద్వంసం చేసిన ఐసిస్............!

ఇరాక్ లో తమ ప్రాభల్యం పెంచుకోవడానికి ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు తెగిస్తున్నారు. ఇరాక్ లోని ప్రసిద్ది చెందిన నిమ్ రుడ్ నగరాన్ని సర్వ నాశనం చేశారు. ఇరాక్ లో అస్సిరీయస్ సామ్రాజ్యం ఉన్న సమయంలో టైగ్రీస్ నది తీరంలో పెద్ద నగరాన్ని నిర్మించారు. 3,000 సంవత్సరాల క్రితం ఇక్కడ పెద్ద పెద్ద స్మారకాలు నిర్మించారు. ఇరాక్ పర్యాటక కేంద్రాలలో నిమ్ రుడ్ నగరం మొదటి స్థానంలో ఉంది.

ఈ నగరాన్ని ద్వంసం చెయ్యడానికి ఐసిస్ ఉగ్రవాదులు ప్లాన్ వేశారు. అనుకున్న విదంగానే శుక్రవారం నిమ్ రుడ్ నగరం మీద పడ్డారు. అన్ని కట్టడాలను బుల్ డోజర్లతో నేలమట్టం చేశారు. స్మారకాలను నేలమట్టం చేసి బుల్ డోజర్లతో తోక్కించి వారి రాక్షతత్వాన్ని మరో సారి బయటకు చూపించారు. అదే విదంగా మసూల్ నగరంలోని మ్యూజియంపై దాడి చేసి అనేక విగ్రహాలను ద్వంసం చేశారు. నిమ్ రుడ్ నగరం నేలమట్టం కావడం, మ్యూజియంపై దాడి చెయ్యడంతో పర్యాటక శాఖకు చాల నష్టం కలిగిందని ఇరాక్ ప్రభుత్వం వెళ్లడించింది.

English summary
It was found that ISIS is having about 46 thousand twitter accounts and destryed a city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X