coronavirus: యూరప్ దేశాల పాపం పండిపోయింది, దేవుడు కావాలనే చేశాడు, ఐసీఎస్ !
లండన్: యూరప్ దేశాలపై నిత్యం పగతో రగిలిపోయే ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఈ సారి తన పంతా మార్చుకుంది. కరోనా వైరస్ వ్యాధితో హడలిపోతున్న యూరప్ దేశాల వైపు మీరు కన్నెత్తి చూడకూడదని, వారిపాపన వారే పోతారని ఐసీస్ ఉగ్రవాదులకు ఆ సంస్థ సూచించింది. దేవుడు కావాలని యూరప్ దేశాలపై కన్నెర్ర చేశారని, వారి పాపం పండిపోయిందని ఐసీఎస్ అంటోంది. కరోనా వైరస్ వ్యాధితో సతమతం అవుతున్న యూరప్ దేశాలకు మీరు ప్రయాణించరాదని ఐసీస్ తన ఉగ్రవాదకులకు ఆదేశాలు జారీ చేసిందని అంతర్జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది.

యూరప్ దేశాలపై ఐసీఎస్ యూటర్న్
యూరప్ దేశాల మీద పగ ప్రతీకారంతో నిత్యం రగిలిపోయే ఇస్లామిక్ స్టేట్ (ఐసీఎస్) కరోనా వైరస్ వ్యాధి వ్యాపించిన నేపథ్యంలో తన స్వరం మార్చింది. కరోనా వైరస్ వ్యాధి (COVID 19)తో సతమతం అవుతున్న యూరప్ దేశాలకు మీ ప్రయాణాలను మానుకోవాలని తన ఉగ్రవాదులు, సానుభూతిపరులకు ఐసీఎస్ సూచించింది.

అల్ సబా, సండే టైమ్స్
కరోనా వైరస్ వ్యాధితో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఐసీస్ తన అధికారిక పత్రిక అల్ సబాలో ఉగ్రవాదులకు ఆదేశాలు జారీ చేసిందని సండే టైమ్స్ కథనం పేర్కొంది. మీరు ప్రస్తుతం జాగ్రత్తగా ఉంటే తరువాత మనం చెయ్యవలసిన పనుల గురించి ఓ నిర్ణయం తీసుకోవచ్చని ఐసీఎస్ తన ఉగ్రవాదులకు సూచించింది.

దేవుడు కరోనాను పంపించాడు !
దేవుడు ఎవరిని హింసించాలని అనుకున్నాడో అక్కడికే (యూరప్ దేశాలు)కు కరోనా వైరస్ వ్యాధిని పంపించాడని ఐసీఎస్ ఉగ్రవాదులకు చెప్పింది. మనం అంటు వ్యాధులు వ్యాపించిన భూమి (యూరప్) దేశాలకు దూరంగా ఉండాలని, మన ఆరోగ్యం కాపాడుకోవాలని ఐసీష్ తన ఉగ్రవాదులు, సానుభూతిపరులకు అల్ సబా పత్రికలో సూచించింది.

మీ ముక్కు, నోరు భద్రం
కరోనా వైరస్ కు మనం దూరంగా ఉండాలంటే ముక్కు చీదే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఆవులించే సమయంలో నోటీకి ముక్కుకు గుడ్డను అడ్డం పెట్టుకోవాలని, క్రమం తప్పకుండా కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవాలని ఐసీస్ తన ఉగ్రవాదులకు సూచించింది. కరోనా వైరస్ వ్యాధితో అల్లాడిపోతున్న యూరప్ దేశాలను కొంత కాలం పట్టించుకోకూడదని, తాత్కాలికంగా ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించరాదని ఐసీఎస్ నిర్ణయం తీసుకుందని సండే టైమ్స్ కథనం ప్రచురించింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications