ఐసిస్‌కి దెబ్బ:భూభాగం కోల్పోతోంది, అందుకే దాడులు

Posted By:
Subscribe to Oneindia Telugu

సిరియా: ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇటీవలి కాలంలో మరీ రెచ్చిపోతున్నారు. గత కొద్ది రోజులుగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. తాము పట్టు సాధించిన పలు చోట్ల క్రమంగా పట్టు కోల్పోతుండటం వల్లే వారు ఇలా రెచ్చిపోయి, తమ ప్రతాపం చూపిస్తున్నారని అంటున్నారు.

ఈ ఏడాది ఆరంభం నుంచి గత ఆరు నెలల వ్యవధిలో ఐసిస్ ప్రాబల్యంలోని భూభాగం పన్నెండు శాతం కుంచించుకు పోయింది.

ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ హ్యమనిస్ట్‌ స్టడీస్‌ అనే సంస్థ ఆదివారం విడుదల చేసిన ఒక విశ్లేషణ ప్రకారం.. ఇరాక్, సిరియాల్లో ఖలీఫా రాజ్యం స్థాపించామని చెప్పుకుంటున్న ఐసిస్ గత ఏడాది కాలంగా పలు పోరాటాల్లో ఓడిపోయింది.

isis

దాంతో 2015లో దాని భూభాగం 12,800 చ.కి.మీ. నుంచి 7800. చ.కి.మీ దాకా.. అంటే 14 శాతం మేర తగ్గింది. 2016 జనవరి నుంచి ఇప్పటివరకు మరో 12 శాతం తగ్గింది. జులై 4వ తేదీ వరకు ఇరాక్‌, సిరియాల్లో కేవలం 68,300 చ.కి.మీ. వరకే దాని ప్రాబల్యం విస్తరించి ఉంది.

ఇరాక్‌లో ప్రభుత్వ దళాలు, ప్రభుత్వ అనుకూల సాయుధ వర్గాలు కలిసి వరుసగా ఐసిస్‍‌ను చావుదెబ్బ తీశాయి. సిరియా, టర్కీల మధ్య ఐసిస్‌ల ప్రధాన రవాణా మార్గంలో ఉన్న మింబెజ్‌ నగరంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారు.

గత మార్చిలో సిరియాలోని పాల్మిరా నుంచి జూన్‌లో ఇరాక్‌లోని ఫలూజా నుంచి ఐసిస్ ఉగ్రవాదులను తరిమివేశారు. మొత్తం మీద ఇరాక్‌లో 45 శాతం భూభాగాన్ని, సిరియాలో 16నుంచి 20 శాతం భూభాగాన్ని ఐసిస్ కోల్పోయింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Islamic State's Caliphate Shrinks by 14 Percent in 2015.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి