International Moon Day: నేడు అంతర్జాతీయ చంద్ర దినోత్సవం.. చారిత్రక ఘట్టానికి 55 ఏళ్లు..
మానవుడు తలుచుకుంటే సాధించలేనిది ఏమి లేదంటారు. అవును ఒక్కొసారి ఇది నిజమే అనిపిస్తుంది. భూమి కాకుండా చంద్రుడి పైకి వెళ్తారని ఎవరైనా అనుకున్నారా.. కానీ చంద్రుడిపై అడుగు పెట్టారు. జాబిలిపై తొలి అడుగుకి నేటికి 55 ఏళ్లు. సరిగ్గా ఇదే రోజు.. జులై 20, 1969న మానవుడు చంద్రుడిపై అడుగు పెట్టాడు. నాసా 1968 లో 'అపోలో-11'లో వ్యోమగాములు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, మైకెల్ కొల్లిన్స్, ఎడ్విన్ ఇ అల్డ్రిన్‌లను చంద్రుడి పైకి పంపింది.
నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మొదటిగా చంద్రుడిపై కాలు మోపి రికార్డు సృష్టించారు. ఆర్మ్‌స్ట్రాంగ్ అడుగుపెట్టిన 20 నిమిషాల తర్వాత.. అల్డ్రిన్ చంద్రుడిపై కాలు మోపాడు. చంద్రుడిపై తొలిసారిగా కాలుమోపిన అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఎంతో ఉద్విగ్నంగా ఆనాడు చేసిన కామెంట్స్‌ను ఇప్పటికీ సైంటిస్టులు గుర్తు చేస్తున్నారు. చంద్రునిపై మనిషి వేసిన తొలి అడుగు మానవాళికి ముందడుగు అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్.

చంద్రుడిపై మనిషి కాలుమోపిన సందర్భానికి గుర్తుగా ఏటా జూలై 20న అంతర్జాతీయ చంద్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం 1969 జూలై 20వ తేదీన అపోలో 11 వ్యోమనౌకకు చెందిన ఈగల్ మాడ్యూల్ ట్రాన్‌క్విలిటీ బేస్‌పైన దిగింది. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై మొదటగా అడుగు పెట్టగా ఆర్మ్ స్ట్రాంగ్‌ను ఎడ్విన్ బజ్, అల్డ్రిన్‌లు ఆ తర్వాత చంద్రుడిపై అడుగు పెట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు నాసాకు చెందిన మరో ఐదుగురు మూన్‌పైకి వెళ్లి వచ్చారు.
ఇక 1972 తర్వాత మనుషులను పంపే మిషన్‌ను అమెరికా మరోసారి చేపట్టలేదు. అప్పటి నుంచి నేటి వరకు ఏ ఒక్క దేశం మనుషులను పంపలేదు. ఇప్పుడు చంద్రుడి పైకి మనుషులను పంపాలని చైనా ప్రయత్నం చేస్తోంది. అలాగే భారత్ కూడా జాబిల్లి పై మనుషులను పంపేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications