Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Air for sale: ఇటలీ కంపెనీ కొత్త స్ట్రాటజీ.. ఎయిర్ ఫర్ సేల్.. ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు!

Canned air: కొంతకాలం క్రితం ఏ ఇంటికి వెళ్లి త్రాగునీరు అడిగినా ఇచ్చేందుకు ఆప్యాయంగా ముందుకొచ్చేవారు. ఎవరో తెలియనప్పటికీ ఆదరించి దప్పిక తీర్చేవారు. కాలం మారుతున్న కొద్దీ ఆ సాంప్రదాయం కనుమరుగై పోయింది. దీనికి కారణం లేకపోలేదు. అప్పుడు ఉచితంగా దొరికే నీరు ఇప్పుడు డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. భవిష్యత్తులో పీల్చే గాలికి కూడా రేటు కడతారేమో అని మన పెద్దవాళ్లు అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు అదే నిజమైంది.

సుందరమైన నాగరికతకు ప్రఖ్యాతి గాంచిన ఇటాలియన్ లేక్‌సైడ్ టౌన్ కోమోను సందర్శించే పర్యాటకులు కొనుగోలు చేసేందుకు గాలి అందుబాటులో ఉంది. వినేందుకు ఇది వింతగా ఉన్నప్పటికీ నిజం. సాధారణంగా అక్కడికి వెళ్లే టూరిస్టులు ఫ్రిజ్ అయస్కాంతాలు, కీ చైన్స్, స్నో గ్లోబ్‌లు మరియు ఆభరణాల కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఈ లిస్టులో ఇప్పుడు 'లేక్ కోమో ఎయిర్' పేరిట ఉన్న స్టీల్ డబ్బాలు కూడా చేరాయి.

Italian company in news with air for sale business

కమ్యూనికేషన్స్ కంపెనీ ఇటలీ కమ్యునికా గాలిని డబ్బాల్లో నింపి విక్రయిస్తుంది. 400ml సైజ్‌లోని ఒక్కో బాటిల్ ధర మన భారతీయ కరెన్సీలో సుమారు 930గా ఉంది. 'ప్రపంచంలోని అత్యంత అందమైన సరస్సు నుంచి స్వచ్ఛమైన గాలి' ఈ డబ్బాలో ఉంది అంటూ సదరు సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ క్యాన్స్ విలాసవంతమైన జీవన విధానానికి గుర్తుగా మార్కెట్ చేయబడుతున్నాయి.

ఈ ప్రాంతాన్ని దర్శించే పర్యాటకులు లేక్ కోమో అనుభవాలను ఇంటికి తీసుకెళ్లే అవకాశాన్ని ఇవి అందిస్తాయని విక్రేతలు చెబుతున్నారు. 'స్వర్గపు అంచుల్లోని ప్రశాంతతను అనుభవించాలనుకునే వారికి సీలు వేయడిన ఈ టిన్ సరైనది' అంటూ వర్ణిస్తున్నారు. ఒత్తిడితో కూడిన లైఫ్‌ స్టైల్‌ నుంచి కొంతసేపు తప్పించుకోవడానికి, ప్రశాంతత అవసరమైనప్పుడు ఆ బాటిల్ తెరవమని ప్రోత్సహిస్తున్నారు.

అక్టోబరు ప్రారంభం నుంచి ఈ డబ్బాలను విక్రయించబడుతున్నారు. ఇవి కోమో మరియు చుట్టుపక్కల ఉన్న స్థానిక దుకాణాలలో మాత్రమే దొరుకుతాయి. లేక్ కోమో ప్రాంతానికి సందర్శకులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కంపెనీ వాటిని ఆన్‌లైన్‌లో విక్రయించడం లేదు. 'లేక్ కోమోని సందర్శించే వారు మాత్రమే మా స్మారక చిహ్నాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నాము' అని వారి వెబ్‌సైట్ పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+