మనీ కోసం మదర్ అయిన కొడుకు.. శవంతోనే రోజూ !!

ఇటలీలోని మాంటౌవా ప్రాంతంలో నమ్మశక్యం కాని మోసం వెలుగు చూసింది. నిరుద్యోగి అయిన 56 ఏళ్ల వ్యక్తి తన తల్లి మరణించిన తర్వాత కూడా ఆమె పెన్షన్‌ను అక్రమంగా పొందడం కోసం చేసిన నాటకం చివరకు పట్టుబడింది. ఆ వ్యక్తి తన తల్లి మృతదేహాన్ని ఏకంగా మూడేళ్లుగా ఇంట్లోనే దాచాడు. గ్రేజియెలా డాల్'ఓగ్లియో 82 ఏళ్ల వయస్సులో దాదాపు మూడేళ్ల క్రితం మరణించింది. కొడుకు ఆమె మరణాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. బదులుగా మృతదేహాన్ని ఒక దుప్పటిలో చుట్టి, స్లీపింగ్ బ్యాగ్‌లో పెట్టి ఇంట్లోని ఓ గదిలో రహస్యంగా దాచాడు. ఇటలీ పోలీసుల ప్రకారం.. మృతదేహం 'మమ్మీఫైడ్' (ఎండిపోయిన) స్థితిలో ఉంది.

తల్లి వేషంలో ప్రభుత్వ కార్యాలయానికి..
కొడుకు దాదాపు మూడేళ్లుగా తల్లి పెన్షన్‌ను అక్రమంగా పొందుతూ వచ్చాడు. అయితే కొత్త గుర్తింపు కార్డు రెన్యెవల్ కోసం ఈ నాటకం పరాకాష్టకు చేరింది. ఆ వ్యక్తి తన తల్లి పాత దుస్తులు ధరించాడు. తనను తాను మహిళగా చూపించుకోవడానికి లిప్‌స్టిక్, ఫౌండేషన్, నెయిల్ వార్నిష్ వంటి మేకప్‌ను ఉపయోగించాడు. అంతేకాక తల్లి తరహాలో జుట్టు కత్తిరించుకుని, పాతకాలపు హారం, చెవిపోగులు ధరించాడు. నిరుద్యోగి అయిన ఈ కొడుకు, తల్లి పెన్షన్ ద్వారా ఏటా దాదాపు £47,000 (సుమారు రూ. 47 లక్షలు) అక్రమంగా ఆర్జిస్తున్నాడు. అతనికి మూడు ఇళ్ల ఆస్తి కూడా ఉన్నట్లు తెలిసింది.

Italian Man Poses as His Dead Mother for Pension Fraud Mummified Body Found After 3 Years

ఎలా దొరికిపోయాడంటే?
ఈ నెల మొదట్లో మాంటౌవా శివార్లలోని బోర్గొ విర్జిలియో ప్రభుత్వ కార్యాలయంలో ఈ మోసం బయటపడింది.ఐడీ కార్డు రెన్యెవల్ చేయించడానికి వచ్చిన ఈ 'మహిళ'ను చూసిన కార్యాలయ ఉద్యోగికి అనుమానం వచ్చింది. అతడికి ఆ 'మహిళ' లావుగా ఉన్న మెడ, భారీగా ఉన్న మగ గొంతు వింతగా అనిపించాయి. తెలివైన ఆ ఉద్యోగి వెంటనే పోలీసులకు, స్థానిక మేయర్‌కు సమాచారం ఇచ్చాడు. బోర్గొ విర్జిలియో మేయర్ ఫ్రాన్సెస్కో అపోర్టి స్వయంగా వచ్చి పరిశీలించారు. "ఆమె చేతి చర్మం 85 ఏళ్ల వృద్ధురాలిలా లేదు, ముడతలు వింతగా ఉన్నాయి. దగ్గరగా చూస్తే మెడ లావుగా, గొంతు మగవారిలా ఉంది" అని ఆయన గుర్తించారు. అధికారులు అసలైన డాల్'ఓగ్లియో ఫోటోలతో కొడుకు వేషాన్ని పోల్చి చూసి మోసాన్ని నిర్ధారించారు.

కొడుకు అరెస్ట్
కొడుకును అరెస్ట్ చేసిన తరువాత, పోలీసులు అతని ఇంటికి వెళ్లగా.. వాషింగ్ రూమ్‌లో దాచి ఉంచిన మృతదేహం దొరికింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపారు. ఆమె మరణం సహజమే అయినప్పటికీ.. ఈ వ్యక్తిపై అక్రమంగా శవాన్ని దాచడం, మోసం ద్వారా లబ్ధి పొందడం వంటి తీవ్ర అభియోగాలపై దర్యాప్తు జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+