Giorgia Meloni: యూరప్ లో ముస్లింలకు చోటే లేదు! ఇటలీ మహిళా ప్రధాని షాకింగ్ కామెంట్స్

యూరప్ దేశాల్లో ముస్లింలపై దాడుల ఘటనలు పెరుగుతున్న వేళ అతివాద ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. వీటిపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చర్చ జరుగుతోంది. ఇంతకీ మెలోనీ ఏమన్నారో తెలుసా ? ఇస్లాం మతానికి యూరప్ దేశాల్లో చోటు లేదని ఆమె వ్యాఖ్యానించారు. దీనికి ఇస్లాంకూ, యూరప్ కూ ఉన్న అనుకూలత సమస్యే కారణమన్నారు.

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తాజాగా మాట్లాడుతూ.. ఇస్లామిక్ సంస్కృతి యూరోపియన్ నాగరికతకు పూర్తిగా సరిపోదని, ఇటలీలో షరియా చట్టాన్ని అమలు చేయడానికి తాను అనుమతించబోనని ప్రకటించారు. ఇస్లామిక్ సంస్కృతి, ఐరోపా నాగరికత విలువలు, హక్కులకు "అనుకూలత సమస్య" ఉందని ఇటలీ ప్రధాని తెలిపారు.ఇస్లామిక్ సంస్కృతి, ఐరోపా నాగరికత విలువలు, హక్కుల మధ్య అనుకూలత సమస్య ఉందని తాను నమ్ముతున్నట్లు ఆమె పేర్కొన్నారు.

italy pm Giorgia meloni asserts no place for islam in europe due to compatibility issue

దీని ప్రకారం ఇటలీలో ఇస్లాం షరియా చట్టాన్ని అమలు చేయడానికి అనుమతించమని ప్రధాని జార్జియా మెలోనీ తేల్చిచెప్పేశారు. తమ నాగరికత యొక్క విలువలు భిన్నమైనవని ఇటలీ ప్రధాని మెలోనీ అన్నారు. రోమ్‌లో అతివాద పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ నిర్వహించిన రాజకీయ సభలో మెలోనీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

ఈ సభలో ఇటలీలోని చాలా ఇస్లామిక్ సాంస్కృతిక కేంద్రాలకు సౌదీ అరేబియా నిధులు సమకూరుస్తుందనేది తనకు తెలుసని ప్రధాని జార్జియా వెల్లడించారు. సౌదీ అరేబియా కఠినమైన షరియా చట్టంపైనా మెలోనీ విమర్శలు గుప్పించారు. సౌదీ అరేబియా షరియా చట్టం పాటిస్తుందని, దీని ప్రకారం వ్యభిచారానికి లాపిడేషన్, మతభ్రష్టత్వం, స్వలింగసంపర్కానికి మరణశిక్ష" విధిస్తారన్నారు. ఇవి తమ నాగరిక విలువలకు వ్యతిరేకమని ఆమె తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+