వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఇవాంకాకు వర్తించని నిబంధనలు, చైనా నుండి దిగుమతులు, తెలివైన వ్యాపారమన్న ట్రంప్

:తన నిబందనలతో ప్రపంచాన్ని వణికిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కూతురు ఇవాంకాకు మాత్రం అమెరికా నిబంధనలు మాత్రం వర్తించడం లేదు. ఇతరులకే నిబంధనలు వర్తిస్తాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బీజింగ్:తన నిబందనలతో ప్రపంచాన్ని వణికిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కూతురు ఇవాంకాకు మాత్రం అమెరికా నిబంధనలు మాత్రం వర్తించడం లేదు. ఇతరులకే నిబంధనలు వర్తిస్తాయి. తమకు కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకొన్న నిర్ణయాల్లో వివాదాస్పదంగా మారిన నిర్ణయాలపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

అయితే అమెరికాలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలి.ఇతర దేశస్తులకు ఉద్యోగాలు ఇచ్చే విషయాల్లో కూడ కొత్త నిబంధనలను ట్రంప్ పాలకవర్గత తెచ్చింది.

అయితే ట్రంప్ కూతురు మాత్రం ఈ నిబంధనలను మాత్రం పాటించడం లేదు. తన ఇష్టారీతిలో వ్యవహరిస్తోందనే విమర్శలను ఎదుర్కొంటుంది.

ట్రంప్ కూతురుకు వర్తించని అమెరికా నిబంధనలు

ట్రంప్ కూతురుకు వర్తించని అమెరికా నిబంధనలు

వడ్డించేవాడు మనవాడైతే చాలు చివరి వరుసలో కూర్చొన్న తిండి దొరుకుతోంది.అనేది నానుడి.ఈ నానుడి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకాకు వర్తిస్తోంది.అమెరికన్ల వస్తువులను కొనుగోలు చేయాలి, ఉద్యోగులను నియమించుకోవాలని అమెరికన్లను నియమించుకోవాలని ట్రంప్ చెబుతుండగా ఇవాంకా మాత్రం చైనాలో తయారైన తన బ్రాండ్ వస్తువులకు దర్జాగా అమెరికాకు దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది.

చైనా నుండి ఇవాంకా బ్రాండ్లు దిగుమతులు

చైనా నుండి ఇవాంకా బ్రాండ్లు దిగుమతులు

ఇటీవల కాలంలో దాదాపుగా 53 టన్నుల 11 షిప్ మెంట్లు చైనా నుండి అమెరికా చేరుకొన్నాయి. వీటిల్లో ఇవాంకా ట్రంప్ బ్రాండ్ దుస్తులు, బూట్లు ఇతర వస్తువులున్నాయి. రెండున్నర టన్నుల మహిళల పాలిస్టర్ ఉత్పత్తులు, 1600 తోలు సంచులు, 23 టన్నుల చైనాలో తయారైన బుట్లు ఇతర వస్తువులున్నాయి.వీటిని ఆమె చైనా నుండి దిగుమతి చేసుకొని అమెరికాలో విక్రయిస్తోంది.

దిగుమతి చేసుకోవడం తెలివైన వ్యాపారం

దిగుమతి చేసుకోవడం తెలివైన వ్యాపారం

దుస్తులు, బూట్లు దిగుమతి చేసుకోవడం తెలివైన వ్యాపారమని ట్రంప్ చెప్పారు. ఎన్నికల ప్రచారసమయంలో ఈ విషయాన్ని ట్రంప్ సమర్థించుకొన్నారు.ఇప్పటివరకు దాదాపుగా 1200 షిప్ మెంట్లను ఇవాంకా ట్రంప్ బ్రాండ్ దిగుమతి చేసుకొంది. ఇవన్నీ చైనా, హంకాంగ్ నుండి వచ్చినవే.

అమెరికాకు అవకాశాల కోసమే

అమెరికాకు అవకాశాల కోసమే

ఇవాంకా ట్రంప్ బ్రాండ్ చైనా దిగుమతి చేసుకోవడం వల్ల అమెరికాకు మరిన్ని అవకాశాలు తెప్పించుకొనేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇటవల ఇవాంకా బ్రాండ్ నుండి 5 వేల జతల దుస్తులు, పది వేల బూట్లకు ఆర్డర్ వచ్చినట్టు చైనా ప్రసార సాధనాలు ప్రకటించాయి.

English summary
In his January inauguration speech, US President Donald Trump made a seemingly straightforward pledge: "We will follow two simple rules: buy American and hire American."His daughter is the exception: even as he spoke, at least eight shipments of Ivanka Trump-branded shoes, bags and clothes - more than 53.5 tonnes - were steaming towards American ports from China, according to US Customs bills of lading examined by AFP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X