Kashmir ఎఫెక్ట్ : కాళ్లు పట్టుకుంటున్న పాక్ ప్రధాని, ఛీ... మీ ముఖాలు చూడను, సౌదీ యువరాజు, చావుదెబ్బ!
సౌదీ/ రియాద్/ ఇస్లామాబాద్: భారతదేశంతో పైన పగ ప్రతీకారంతో ప్రతిరోజు 24 గంటలు రగిలిపోయే పాకిస్థాన్ కు చావు దెబ్బ తగిలిగింది. ఛీ... మీ ముఖం చూడను అంటూ సౌదీ యువరాజు పరోక్షంగా చెప్పడంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆదేశ ప్రజలు షాక్ కు గురైనారు. పాక్ ప్రతినిధులను కలవడానికి సౌదీ యువరాజు నిరాకరించడంతో పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆదేశ విదేశాంగ మంత్రి, అధికారులు అయోమయానికి గురైనారు.
Recommended Video
అయ్యా... మమ్మల్ని క్షమించండి,,, పొరపాటు జరిగిపోయింది అంటూ సౌదీ యువరాజుకు మొరపెట్టుకోవడానికి ప్రయత్నించిన పాక్ విదేశాంగ మంత్రిని కలవడానికి సౌదీ యువరాజు నిరాకరించారు. ఈ దెబ్బతో దాయాది దేశం పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితి కుడితో పడిన ఎలుక ఎలా గిలగిలా కొట్టుకుంటుందో అచ్చం అలాగే ఉంది.

కాశ్మీర్ వ్యవహారంలో చెడింది
కాశ్మీర్ వ్యవహారంలో భారత్ మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్న పాకిస్థాన్ ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకోవడానికి గోచీ కూడా కట్టుకోకుండా అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇదే సమయంలో ఇంధనం తయారు చేసి ప్రపంచ దేశాలకు విక్రయిస్తున్న గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు వెంటనే విదేశాంగ శాఖా మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి మాకు మద్దతు ఇవ్వాలని, భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడాలని పాక్ విదేశాంగా మంత్రి షా మొహమ్మద్ ఖరేషీ గల్ఫ్ దేశాల మీద ఒత్తిడి తీసుకువచ్చారు.

ఇదేమైనా మీ అత్తగారి ఇల్లా ?
పాకిస్థాన్ చేస్తున్న డిమాండ్ లను సౌదీ అరేబియా నేతృత్వంలోని ఇస్లామిక్ సహకార సంఘ సంస్థలు, ఆయా దేశాలు (ఓఐసీ) పెద్దగా పట్టించుకోలేదు. కాశ్మీర్ విషయంలో మాకు పూర్తి మద్దతు ఇవ్వాలని చెబుతున్నా సౌదీ అరేబియాతో పాటు, గల్ఫ్ దేశాలు పట్టించుకోవడం లేదని, బహిరంగ మద్దతు ఇవ్వడంలేదని ఆరోపిస్తూ పాకిస్థాన్ విదేశాంగా మంత్రి షా మొహమ్మద్ ఖరేషీ రెచ్చిపోయి నోటికి వచ్చినట్లు మాట్లాడారు. సౌదీ అరేబియా ఏమైనా మీ అత్తగారి ఇల్లు అనుకుంటున్నావా ? అంటూ సౌదీ ప్రభుత్వం పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీకి చివాట్లు పెట్టింది.

సౌదీ యువరాజుకు మండింది
కాశ్మీర్ విషయంలో భారత్ చేస్తున్న ఆరోపణలను గల్ఫ్ దేశాల ప్రతినిధులు ఎవ్వరూ ఖండించడం లేదని, తాము గల్ఫ్ దేశాల్లోని ఓ వర్గం వారికి ప్రాతినిధ్యం వహిస్తామని పాకిస్థాన్ సౌదీ ప్రభుత్వానికి సవాలు చేసింది. ఈ విషయంపై సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ కు ఎక్కడో మండిపోయింది. పాకిస్థాన్ కు ఇంత వరకు చేస్తున్న ఆర్థిక సహాయంతో పాటు రాయితీ ధరలతో ఇంధనం సరఫరా చెయ్మమని సౌదీ యువరాజు తేల్చి చెప్పారు.

కాళ్లు పట్టుకుంటున్న పాక్ ప్రధాని
సౌదీ అరేబియా యువరాజు మోహమ్మద్ బిన్ సల్మాన్ నిర్ణయంతో పాక్ ప్రధాన మంత్రి ఇమ్రామ్ ఖాన్ తో పాటు ఆదేశ ప్రభుత్వం షాక్ కు గురైయ్యింది. ఎలాగైనా సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ కు క్షమాపణ చెప్పాలని ప్రయత్నించిన ఇమ్రాన్ ఖాన్ పాక్ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ ఖురేషీ, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖ్వమర్ జావేద్ తదితరులను సౌదీ అరేబియాకు పంపించి రాజీ ప్రయత్నాలు చేశారు. పాక్ ప్రభుత్వం తరపున విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ ఖురేషీ, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖ్వమర్ జావేద్ సౌదీ యువరాజుకు క్షమాపణలు చెప్పి రాజీ చేసుకోవడానికి విఫలయత్నం చేశారు.

మీ ముఖం చూపించకండి
పాక్ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ ఖురేషీ, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖ్వమర్ జావేద్ ను కలవడానికి సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ నిరాకరించారు. తన సోదరుడు సౌదీ అరేబియా రక్షణ శాఖ సహాయ మంత్రి అయిన షేక్ ఖలీద్ బిన్ సల్మాన్ తో మీరు భేటీ అయితే చాలని, తాను మాత్రం మిమ్మల్ని కలవనని, నేను బీజీగా ఉన్నానని సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ తేల్చి చెప్పారు. సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ దెబ్బకు పాకిస్థాన్ దిమ్మతిరిగిపోయింది. చీ... మీ ముఖాలు కూడా చూడను అని సౌదీ అరేబియా యువరాజు పరోక్షంగా పాక్ ప్రతినిధులకు చెప్పారని మీడియా కోడైకూస్తోంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications