7.6 తీవ్రతతో వణికించిన పెను భూకంపం: సునామీ అలలు: అల్లకల్లోలం.. పశ్చిమ తీరం
Japan earthquake: జపాన్‌లో మరోసారి పెను భూకంపం సంభవించింది. పశ్చిమ తీర ప్రాంతాన్ని వణికించింది. భూకంప తీవ్రత అనూహ్యంగా ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. తీర ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేయించారు.
తీర ప్రాంతంలోని ఇషికవా ప్రీఫెక్షర్ రీజియన్‌ను భూకంప కేంద్రంగా గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా రికార్డయింది. జపాన్ పశ్చిమ ప్రాంతంలో ఉంటుందీ ఇషికవా ప్రీఫెక్షర్. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:10 నిమిషాలకు ఈ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

ఇషికావ ప్రీఫెక్షర్ పరిధిలో ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల భూమి ప్రకోపించింది. దీని తీవ్రత.. తీర ప్రాంతంలోని ఇషికావ, నిగిట, టొయొమా, యమగట ప్రీఫెక్షర్స్‌లో అల్లకల్లోలాన్ని సృష్టించింది. ఈ మూడు రీజియన్ల పరిధిలో ఉన్న నగరాలను భయభ్రాంతులకు గురి చేసింది.
తీర నగరాలైన వజీమా, నొటో, కషివజక్కిల్లో భూ ప్ర్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం అందలేదు. కొన్ని భవనాలు బీటలు వారినట్లు చెబుతున్నారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు నమోదు కావడం వల్ల స్థానికులు ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు.
కాగా భూకంపం అనంతరం సముద్రంలో అలలు పోటెత్తాయి. అనమిఝు, ననావో, న్యూజెన్, కురొబె-షి తీరాల్లో అయిదు మీటర్ల వరకు అలలు ఎగిసిపడినట్లు జపాన్ న్యూస్ అవుట్‌లెట్ ఎన్‌హెచ్‌కే తెలిపింది. సునామీ హెచ్చరికలను జారీ చేసినట్లు వివరించింది.
WATCH: Tsunami waves observed along the coast of western Japan. People being urged to evacuate pic.twitter.com/sY3bdpVZVc
— BNO News (@BNONews) January 1, 2024
ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంతం మొత్తాన్నీ అధికారులు ఖాళీ చేయించారు. పర్యాటకులను సురక్షిత ప్రదేశాలకు వెళ్లాల్సిందిగా ఆదేశాలను జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకుని రావడం, అలలు ఉవ్వెత్తున ఎగిసిపడటం వంటి ఘటనలకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications