ఉషను భారత్ పంపేయండి..! జేడీ వాన్స్ పై భారతీయ అమెరికన్ల ఫైర్..!
అమెరికాలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అమెరికన్లను అడ్డుపెట్టి మరీ విదేశీయుల్ని సాగనంపే పనిలో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన డిప్యూటీ అయిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా వలసలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా వాన్స్ చేసిన ఓ వ్యాఖ్య ఆయనకే బూమరాంగ్ అయింది. చివరికి తన భార్యను ఇండియా పంపేయాలన్న డిమాండ్లు అమెరికాలో మొదలయ్యాయి.
సామూహిక వలసలు అమెరికా కలల దొంగతనం లాంటిదేనంటూ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా వ్యాఖ్యానించారు. దీనిపై స్వదేశంలో విమర్శలు మండిపడుతున్నారు. విదేశీయులపై అంత ద్వేషం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. వాన్స్ భార్య ఉష భారతీయ వలసదారుల కుమార్తె అని, ఆమెను తిరిగి స్వదేశానికి పంపేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సామూహిక వలసలు అమెరికన్ కార్మికుల నుండి అవకాశాలను దూరం చేస్తున్నాయని పేర్కొంటూ ఎక్స్ లో వాన్స్ ఓ పోస్ట్ చేశారు.

దీనిపై రచయిత, రాజకీయ వ్యాఖ్యాత వజాహత్ అలీ తీవ్రంగా స్పందించారు. అంటే మీరు ఉషను, ఆమె భారతీయ కుటుంబాన్ని, మీ ద్విజాతి పిల్లలను భారతదేశానికి తిరిగి పంపాలని ఆయనకు సూచించారు. తాజాగా న్యూయార్క్ పోస్ట్ పాడ్‌కాస్ట్‌లో కనిపించిన వాన్స్.. అమెరికన్లు తమ జాతి, భాష లేదా చర్మ రంగును పంచుకునే పొరుగువారిని ఇష్టపడటం పూర్తిగా సహేతుకమైనది, ఆమోదయోగ్యమైనదని తెలిపారు. ఈ వ్యాఖ్యలపైనా విమర్శలు వస్తున్నాయి.

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల్ని కాపీ కొడుతూ విమర్శలు చేస్తారని పేరున్న జేడీ వాన్స్.. విభజనను ప్రోత్సహించే వలస వ్యవస్థను పెంచి పోషించారంటూ మాజీ అధ్యక్షుడు బైడెన్ పై ఆరోపణలు చేశారు. ట్రంప్ ప్రభుత్వం తిరిగి వస్తే అన్ని పత్రాలు లేని వలసదారులను బహిష్కరిస్తారా అని అడిగినప్పుడు, వీలైనంత ఎక్కువ మందిని పంపేందుకు ప్రయత్నిస్తున్న్టలు తేల్చిచెప్పేశారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications