Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్రంప్ సీటు కోసం జెడీ వాన్స్ బిగ్ ప్లాన్..! ఉష మతం మారకపోతే ?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవైపు తన సంచలన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అదే సమయంలో మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ఇప్పటి నుంచే సంకేతాలు ఇచ్చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన చనిపోతే అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నానంటూ గతంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. దీనికి ఏమాత్రం తగని విధంగా మరో సంచలనానికి జేడీ వాన్స్ ఇప్పుడు తెరలేపారు.

అమెరికా అధ్యక్ష స్ధానంపై మూడోసారి గురిపెట్టిన ట్రంప్ ప్రయత్నాలకు కౌంటర్ గా తాను కూడా ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నట్లు జేడీ వాన్స్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ప్రస్తుతం అమెరికన్లే ముఖ్యమంటూ, అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకెళ్తున్న వాన్స్ కు భారత్ కు చెందిన ఆయన హిందూ భార్య ఉష మతం అడ్డంకిగా మారింది. తాజాగా ఓ ఈవెంట్ లో వాన్స్ ముందు ఇదే ప్రశ్న ఎదురైంది.

JD Vance s Presidential Dreams Spark Debate Over Wife Usha s Faith Will She Convert

ఈ కార్యక్రమంలో భారత సంతతికి చెందిన ఒక విద్యార్థి వలసలు, మతం పట్ల వాన్స్ కఠినమైన వైఖరికీ, అతని హిందూ భార్య ఉషతో సంబంధానికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని ప్రశ్నించాడు. మీ పిల్లలకు మీ మతాన్ని వారి తల్లి మతం కంటే ముందు ఉంచవద్దని మీరు ఎలా చెప్తున్నారని అతను వాన్స్ ను అడిగాడు. 2019లో కాథలిక్కుగా మారడానికి ముందు సువార్తిక ప్రొటెస్టంట్ నేపథ్యంలో పెరిగిన వాన్స్, తాను, ఉష కలిసినప్పుడు నాస్తికులుగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

అక్కడితో ఆగకుండా వాన్స్.. ఆదివారాల్లో ఉష తనతో పాటు చర్చికి వస్తుందని తెలిపారు. చర్చి తనను ఎలా కదిలించిందో, అలాగే ఆమెను కూడా కదిలిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తాను అలా కోరుకుంటున్నానన్నారు. ఎందుకంటే తతాాను క్రైస్తవ సువార్తను నమ్ముతాననన్నారు. చివరికి తన భార్య కూడా అదే విధంగా చూస్తుందని తాను ఆశిస్తున్నట్లు జేడీ వాన్స్ తేల్చేశారు. తద్వారా తన భార్య తన కోసం మతం మారుతుందని జేడీ వాన్స్ చెప్పుకొచ్చారు. కానీ ఆమె అలా చేయకపోతే, ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛా సంకల్పం ఉందని దేవుడు చెబుతున్నాడు, కాబట్టి అది తనకు సమస్య కాదన్నారు.

JD Vance s Presidential Dreams Spark Debate Over Wife Usha s Faith Will She Convert

జేడీ వాన్స్ వ్యాఖ్యలపై అమెరికాలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. వాన్స్ వ్యాఖ్యలను రిపబ్లికన్లు, క్రైస్తవ సంప్రదాయవాదులు ప్రశంసలతో ముంచెత్తారు. భారతీయ అమెరికన్లు మాత్రం వాన్స్ పై విరుచుకుపడుతున్నారు. అసలే అమెరికాలో భారతీయ వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో చాలా మంది వాన్స్ వ్యాఖ్యలను రాజకీయం కోసం తన భార్య సొంత మతం, సంస్కృతిని ఆయన తిరస్కరించినట్లు భావిస్తున్నారు. తన భార్య హిందూ మూలాన్ని ఒప్పుకోవడానికి వాన్స్ భయపడుతున్నట్లు చెప్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+