ఒబామాకు జాబ్ ఆఫర్
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఇప్పటికే ఓ జాబ్ ఆఫర్ వచ్చేసింది.
వాషింగ్టన్: అగ్రరాజ్యానికి ఎనిమిదేళ్ళు అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా మరో పది రోజుల్లో ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. అయితే పదవీ విరమణ తర్వాత ఏం చేయాలని ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఆయనకు ఇప్పటికే ఓ జాబ్ ఆఫర్ వచ్చేసింది.
ప్రపంచ ప్రఖ్యాత స్ట్రీమింగ్ సర్వీస్ 'స్పాటిఫై' ఒబామాకు జాబ్ ఇస్తామని ప్రకటించింది. ఆ సంస్థ సీఈఓ డేనియల్ ఏక్ తన ట్వీట్ లో ఈ ఆఫర్ ప్రకటించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ప్లే లిస్ట్స్ అనే హోదా కలిగిన ఉద్యోగం ఇది.

ఈ ఉద్యోగం కోసం అగ్రరాజ్యాన్ని కనీసం ఎనిమిదేళ్ళు పాలించిన అనుభవం ఉన్న వ్యక్తి కోసం చూస్తున్నామని సరదాగా ఓ యాడ్ రూపొందించారు. అభ్యర్థి నోబెల్ పీస్ ప్రైజ్ గెలిచిన వారై ఉండాలన్న నిబంధన కూడా ఉంది. 2009లో ఒబామాకు శాంతి బహుమతి వచ్చిన విషయం తెలిసిందే.
ప్రముఖ కళాకారులు తెలిసిన వ్యక్తి అయితే మంచిదని ప్రకటించింది.ప్లేలిస్ట్స్ గురించి ప్రెస్‌మీట్లలో అనర్గళంగా మాట్లాడే వ్యక్తి కావాలి అని ఆ యాడ్‌లో తెలిపింది.
ప్రపంచ అత్యుత్తమ వక్తల్లో ఒకరుగా ఉండాలని ఒబామాను పరోక్షంగా ప్రశంసించింది. ఇదిలా ఉండగా, యాడ్ చివర్లో తాను స్పాటిఫైలో జాబ్ కోసం ఎదురుచూస్తున్నానని ఇటీవల ఒబామా ఇన్‌స్టాగ్రాంలో చేసిన పోస్ట్ కూడా ఉంది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications