అడుగు దూరంలో గెలుపు- కానీ, అక్కడే ట్విస్ట్..!!
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. ప్రపంచం మొత్తం అమెరికా ఫలితాల వైపే చూస్తోంది. తాజా ట్రెండ్స్ లో ట్రంప్ ఆధిక్యత కొనసాగుతోంది. అయితే, కమలా హ్యారీస్ సైతం దూసుకొస్తున్నారు. స్వింగ్ రాష్ట్రాల్లో అనూహ్య ట్రెండ్స్ వెల్లడవుతున్నాయి. తాజాగా అందుతున్న లెక్కల మేరకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు 198 ఓట్లు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌కు 112 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ అంచనాలు మారుతున్నాయి.
ట్రంప్ ముందంజ
అమెరికా ఫలితాల్లో ఇప్పటి వరకు వస్తున్న ట్రెండ్స్ మేరకు ట్రాంప్ 20 రాష్ట్రాల్లో గెలవగా, 9 రాష్ట్రాల్లో గెలిచిన హారిస్ మరి కొన్ని రాష్ట్రాల్లో గెలుపుకు దగ్గరగా ఉన్నారు. పోలింగ్ పూర్తయి కౌంటింగ్ కొనసాగుతున్న రాష్ట్రాల్లో ఫలితాలు అంచనాలకు భిన్నంగా కనిపిస్తున్నాయి. స్వింగ్ రాష్ట్రాల్లో మరింత ఆసక్తి కరంగా మారాయి. డొనాల్డ్ ట్రంప్ అలబామా, ఆర్కాన్సాస్, ఫ్లోరిడా,ఇండియానా, కెంటకీ, మిసిసిపి, ఓక్లహోమా, టెన్నెసీ, వెస్ట్ వర్జీనియా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో విజయం సాధించారు. కమలా హ్యారీస్ ఇప్పటికే కనెక్టికట్, డెలవేర్, ఇల్లినోయీ, మసాచుసెట్స్, మేరీల్యాండ్, న్యూజెర్సీ, రోడ్ ఐల్యాండ్, వెర్మాంట్ లో గెలిచి.. మరి కొన్ని రాష్ట్రాల్లో గట్టి పోటీ ఇచ్చారు.

ట్రంప్ వైపే యువత
లేటెస్ట్ ట్రెండ్స్ మేరకు డొనాల్డ్ ట్రంప్ 198 ఎలక్టోరల్ ఓట్లు, హారిస్‌కు 112 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. మెజార్టీ రాష్ట్రాల్లో ట్రంప్‌దే ఆధిక్యం కొనసాగుతోంది. అయితే, ఇద్దరి మధ్య కొన్ని రాష్ట్రాల్లో హోరా హోరీగా ఓట్లు వస్తుండటంతో.. తుది ఫలితం పైన ఇంకా ఉత్కంఠ పెరిగిపోతోంది. తాజా అంచనాల మేరకు కమలా హ్యరీస్ మిచిగాన్, పెన్సిల్వినేయాలో విజయం సాధిస్తే అధ్యక్ష రేసులో తుది విజయం కు ఛాన్స్ ఉంటుంది. కానీ, స్వింగ్ స్టేట్స్ లోనూ కొన్ని చోట్ల అంచనాలు తారు మారు అయ్యాయి. మహిళా ఓటింగ్ పెద్ద సంఖ్యలో కమలా హరీస్ కు అనుకూలంగా కనిపించగా.. యూత్ ఓటింగ్ మాత్రం గతం కంటే స్వల్పంగా ట్రంప్ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
మారుతున్న ట్రెండ్స్ తో
డెమోక్రట్లకు పట్టు ఉన్న రాష్ట్రాల్లోనూ హోరా హోరీ కనిపించటం ఆశ్చర్యకరంగా మారింది. అధ్యక్షుడిగా గెలవాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు కావాలి. ఇప్పటికే ట్రంప్ కు 198ఖాయంగా కనిపిస్తుండటంతో.. ఇక, ట్రంప్ విజయం ఖాయమనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో స్వింగ్ రాష్ట్రాల్లో హరీస్ కు మద్దతు అంచనాలకు తగినట్లుగా కనిపిస్తోంది. దీంతో, కౌంటింగ్ కొనసాగే కొద్దీ వెల్లడయ్యే ట్రెండ్స్ కీలకంగా మారుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న కౌంటింగ్ సాయంత్రానికి పూర్తయ్యే ఛాన్స్ ఉంది. మరి కాపేసట్లో అమెరికా నూతన అధ్యక్షుడి పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే, జనవరి 20న అమోరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరగనుంది.

-
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications