మనకు మార్క్సిస్టుల పాలన కావాలా?

Donald Trump-Kamala Harris debate 2024: గడువు దగ్గర పడుతున్న కొద్దీ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడిగా పతాక స్థాయికి చేరుకుంటోంది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లతో అక్కడి రాష్ట్రాలు హోరెత్తిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు, గెలిచి తీరాలనే పట్టుదలతో రిపబ్లికన్లు పోరాడుతున్నారు.

ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన అక్కడ పోలింగ్ జరుగనుంది. డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ డిబేట్‌కు హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో వారిద్దరి మధ్య ఏర్పాటైన తొలి డిబేట్ ఇదే.

Kamala Harris is a Marxist and it will be the end of our country says Donald Trump

పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా దీనికి వేదిక. అమెరికా కాలమాన ప్రకారం సరిగ్గా మంగళవారం రాత్రి 9 గంటలకు ఈ డిబేట్ ఆరంభమైంది. లారా లూమర్.. దీనికి కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్నారు. ఏబీసీ న్యూస్ ఈ డిబేట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.

డిబేట్ సందర్భంగా కమలా హ్యారిస్.. డొనాల్డ్ ట్రంప్ పాలనపై ఘాటు విమర్శలు చేశారు. ఆయన హయాంలో ఖజానా ఖాళీ అయిందని, నిరుద్యోగం, ఆర్థిక భారం పడటానికి ఆయన పరిపాలనే ప్రధాన కారణమంటూ ఆరోపించారు. ప్రజారోగ్యం సైతం సరిదిద్దడానికి వీలులేనంతగా ధ్వంసమైందంటూ విమర్శించారు.

దీనిపై డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. కమలా హ్యారిస్‌ను మార్క్సిస్టుగా అభివర్ణించారు. ఆమె మార్క్సిస్ట్ అనే విషయం దేశ ప్రజలందరికీ తెలిసిన విషయమేనని గుర్తు చేశారు. ఆమె తండ్రి మార్క్సిస్ట్ భావజాలం ఉన్న ఆర్థిక ప్రొఫెసర్ అని పేర్కొన్నారు. అవే ఆర్థిక విధానాలను కమలా హ్యారిస్‌కు బోధించి ఉంటారని అన్నారు.

తన హయాంలో ఎప్పుడూ అదనపు పన్నులను విధించలేదని డొనాల్డ్ ట్రంప్ వివరణ ఇచ్చారు. డెమోక్రాట్ల పాలనలో మూడున్నర సంవత్సరాల పాటు భారీగా పన్నులను విధించారని విమర్శించారు. బిలియన్ల డాలర్లను అమెరికన్లు పన్నుల రూపంలో చెల్లించుకోవాల్సి వచ్చిందని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+