Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వేర్పాటువాద నేత సయ్యద్ అలీ గిలానీ కన్నుమూత

సీనియర్ నేత సయ్యద్ అలీ షా గిలానీ కన్నుమూశారు. స్వగృహంలో రాత్రి పదిన్నరకు తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాలికంగా ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. హురియత్ కాన్ఫరెన్స్‌ జమ్ముకశ్మీర్‌ వేర్పటు వాదం కోసం జీవితాంతం పోరాడారు. వేర్పాటువాదమే తన అజెండాగా పనిచేశారు. చివరికీ అనారోగ్యంతో చనిపోయారు.

గిలానీకి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. గిలానీ మృతి వార్త కశ్మీర్‌లో భద్రత పరమైన సమస్య వచ్చే అవకాశం ఉంది అని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. అహింసయుతంగా కశ్మీర్ సమస్యను పరిష్కరించుకుందామని చెప్పేవారు. తర్వాత ఉగ్రవాద ఆర్థిక కార్యకలాపాలు, మనీ ల్యాండరింగ్ కేసులను ఎదుర్కొన్నారు. 2020లో పాకిస్తాన్ ఉన్నత పౌర పురస్కారం నిషాన్ ఏ పాకిస్తాన్ అవార్డును అందుకున్నారు.

 Kashmiri separatist leader Syed Ali Shah Geelani died

సయ్యద్ అలీ గిలానీ సొపోరాకు సమీపంలోని ఓ కుగ్రామంలో 1929 సెప్టెంబర్‌29న జన్మించారు. 2008 నుంచి కూడా గిలానీ గృహనిర్బంధంలో ఉన్నారు. హురియత్ కాన్ఫరెన్స్‌ ఛైర్మన్‌ పదవికి గతేడాది ఆయన రాజీనామా చేశారు. మొదట ఆయన జమాతే ఈ ఇస్లామి కశ్మీర్‌ సభ్యుడిగా ఉండేవారు. తర్వాత తెహ్రీక్‌ ఇ హురియత్‌ స్థాపించారు ఆల్‌పార్టీ హురియత్ కాన్ఫరెన్స్‌ ఛైర్మన్‌గా కూడా పని చేశారు. వేర్పాటుకు మద్దతు ఇచ్చే పార్టీలతో కలిసి దీన్ని ఏర్పాటు చేశారు.

సొపోర్‌ నియోజకవర్గం నుంచి 1972, 77, 87లో ఎమ్మెల్యేగాను పోటీ చేసి గెలుపొందారు. గిలానీ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి మెహబూబాముఫ్తీ సంతాపం వ్యక్తం చేశారు. అతనితో కొన్ని అంశాలపై విభేదించవచ్చు కానీ.. మరణం మాత్రం తీవ్రంగా కలచివేస్తుందని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+