Nobel Prize 2023 in Medicine: కోవిడ్‌ను నిర్మూలించే ఫార్ములా- ఆ ఇద్దరినీ వరించిన నోబెల్
స్టాక్‌హోమ్: వేర్వేరు రంగాలకు చెందిన శాస్త్రేవేత్తలు, ఆర్థికవేత్తలు, ఇతర సామాజిక ఉద్యమకారులకు ప్రతి సంవత్సరం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల సందడి మొదలైంది. వారం రోజుల పాటు ఈ అవార్డుల ప్రకటన కొనసాగుతుంది. ఒక్కోరోజు ఒక్కో రంగంలో కృషి చేసిన వారికి నోబెల్ బహుమతుల ప్రకటన ఉండబోతోంది.
ఆర్థికం, వైద్యం, సామాజిక అంశాలు, పర్యావరణం, ఫిజిక్స్.. ఇలా విభిన్న రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించిన, వాటికి ఆద్యులైన శాస్తవేత్తలకు అందించే ఈ అవార్డుల ప్రకటన పరంపర కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది. అద్భుతాలను ఆవిష్కరించిన హంగేరియన్- అమెరికన్ బయో కెమిస్ట్ కటాలిన్ కరికో, అమెరికన్ ఫిజీషియన్ సైంటిస్ట్ డ్రూ వీస్‌మన్‌లకు మెడిసిన్‌లో నోబెల్ బహుమతి వరించింది.

వారిద్దరినీ మెడిసిన్‌లో నోబెల్ ప్రైజ్ కోసం వారిద్దరినీ ఎంపిక చేసింది నోబెల్ జ్యూరీ కమిటీ. ఈ మేరకు నోబెల్ కమిటీ కార్యదర్శి ఒలావ్ జోల్‌స్టాడ్ వారి పేర్లను ప్రకటించారు. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో గల కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ల తయారీలో వారిద్దరూ కృషి చేశారు. ఎంఆర్ఎన్ఏ ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో అత్యంత కీలకమైన న్యూక్లియోసైడ్ బేస్ సవరణలను సూచించారు. వారు సూచించిన ఈ సవరణల ద్వారానే ఎంఆర్ఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేయగలిగారు.
ప్రస్తుతం కటాలిన్ కరికో, డ్రూ వీస్‌మన్.. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ ప్రొఫెసర్లుగా పని చేస్తోన్నారు. ఎంఆర్ఎన్ఏలో న్యూక్లియోసైడ్ బేస్ సవరణలను సూచిస్తూ 2005లో వారు తమ రీసెర్చ్ డాక్యుమెంట్లను ప్రచురించారు. కోవిడ్ 19 మహమ్మారి వ్యాప్తి చెందిన సమయంలో ఆ డాక్యుమెంట్ల ఆధారంగా ఎంఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్లను అభివృద్ధి చేయగలిగారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications