Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైరల్ వీడియో: ఖమేనీ మృతితో సంబరాల్లో మహిళలు.. సిగరెట్లు తాగుతూ..!

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఒకదానిపై మరొకటి క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. అయితే ఇరాన్ పై జరిపిన దాడుల్లో సుప్రీ లీడర్ ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్ మీడియా ధృవీకరించింది. అంతేకాక ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు మరణించినట్లు వెల్లడించింది. అయితే ఖమేనీ మరణంతో ఇరాన్ లోని యువత సంబరాలు చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'.. పేరుతో ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిచెందినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం అధికారికంగా ప్రకటించారు. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు తెలిపారు. ఖమేనీని చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తులలో ఒకరిగా ఈ మేరకు ట్రంప్ అభివర్ణించారు.

అయితే ఖమేనీ మృతితో ఇరాన్ లోని యువత సంబరాలు చేసుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు ప్రత్యక్షం అవుతున్నాయి. అటు ఆందోళనకారులు కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఖమేనీ మరణవార్త విన్న ఆ మహిళ సంతోషం వ్యక్తం చేస్తూ ఈ వీడియోను చిత్రీకరించారు.

Khamenei Reportedly Killed in Attacks Iran Youth Rejoice Shocking Viral Video of Photo Burning

మోర్టిసియా ఆడమ్స్(25) అనే మహిళ.. ఖమేనీ మృతిపై తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఖమేనీ ఫోటోకు నిప్పు అంటించి ఆ మంటతో సిగరెట్ వెలిగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలోనూ ఖమేనీ ఫోటోను తగలబెట్టి.. ఆ మంటతో సిగరెట్ వెలిగించుకున్న వీడియో చేశారు. ఆ వీడియోతో ఒక్కసారిగా ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వీటితో పాటు హిజాబ్ లేకుండా కనిపించడం, బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడం, దేశ అత్యున్నత నాయకుడిని అవమానించడం తదితర చర్యల ద్వారా ఆమె ఇరాన్ నిరసనకారులకు ప్రతిరూపంగా నిలిచారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+