అమెరికాకు కిమ్ షాక్: సురక్షితంగా తప్పించుకొనే మార్గం, చైనా సహయం?
అమెరికా తొలుత ఉత్తరకొరియాపై దాడి చేస్తే తప్పించుకొనేందుకు కిమ్ రక్షణ ఏర్పాట్లు చేసుకొన్నారు.సురక్షిత మార్గం ద్వారా చైనా భూభాగంలో తలదాచుకోనున్నారు.
ప్యాంగ్‌యాంగ్: అమెరికాను నాశనం చేస్తానని సవాల్ విసిరి యుద్దం వస్తోందనే భయాలను సృష్టించిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్ ఉన్ యుద్దం జరిగితే ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై ముందుజాగ్రత్తలు తీసుకొంటున్నారు. అమెరికా దాడుల నుండి సురక్షితంగా తప్పించుకొనేందుకు రహస్య మార్గాలను ఏర్పాటుచేసుకొన్నారని అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.
తన ప్రకటనలతో యుద్ద వాతావరణాన్ని తీసుకువచ్చాడు కిమ్‌జాంగ్ఉన్. ప్రపంచానికి పెద్దన్న తరహలో వ్యవహరిస్తున్న అమెరికాకు పక్కలో బల్లెంలా తయారయ్యాడు కిమ్.
అమెరికా చేస్తోన్న హెచ్చరికలను కూడ ఆయన లెక్కచేయడం లేదు. పైగా అమెరికాకే చుక్కలను చూపిస్తున్నాడు. అమెరికాకు చెందిన గ్వామ్ ద్వీపాన్ని సర్వనాశం చేస్తానంటూ ఇటీవలే హెచ్చరికలు కూడ చేశారు.
ఈ మేరకు గ్వామ్ ద్వీప చిత్రాలతో ఆర్మీ అధికారులతో ఆయన సంప్రదింపులు జరుపుతున్న ఫోటోలు ఉత్తరకొరియా మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ మీడియాలో ప్రసారమైన ఈ కథనాలు అమెరికాను ఇబ్బందుల్లో పెట్టాయి.

అమెరికా దాడి చేస్తే రక్షణ చర్యలను తీసుకొన్న కిమ్
అమెరికాకు సవాల్ చేసిన కిమ్ అన్నంత పనిచేసేటట్టు కన్పిస్తున్నారు. అయితే ఉత్తరకొరియా తీరుపై అమెరికా కూడ సీరియస్‌గానే ఉంది. ఈ తరుణంలో అమెరికానే ముందుగా ఉత్తరకొరియాపై దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది. అయితే ఒకవేళ అదే జరిగితే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సురక్షితంగా బయటపడతాడా లేదా అనే ప్రశ్నలు కూడ లేకపోలేదు. అయితే సురక్షితంగా అమెరికా దాడులనుండి తప్పించుకొనే ఏర్పాట్లను కిమ్ చేసుకొన్నారు. అమెరికా కంటే ముందుచూపుతోనే కిమ్ వ్యవహరిస్తున్నారు.

సురక్షిత మార్గం ద్వారా తప్పించుకొనే మార్గాన్ని ఎంచుకొన్న కిమ్
అమెరికానే ఉత్తరకొరియాపై ముందుగా దాడి చేస్తే కిమ్ ఏం చేస్తారు? ఎలా స్పందిస్తారు? ధైర్యంగా నిలబడతారా? లేక పారిపోతారా.. అందుకు అవసరమైన సురక్షితమైన మార్గాన్ని సిద్ధం చేసుకున్నారా? ఎక్కడికి పారిపోనున్నారు? అనే ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానం వస్తోంది.ఉత్తరకొరియాపై అమెరికా మిలిటరీ దాడి చేస్తే చైనా చెక్కేసేందుకు సురక్షితమైన మార్గాన్ని అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సిద్ధం చేసుకున్నారు. ఆయనతోపాటు భార్య, లెఫ్ట్‌నెంట్ జనరల్ కిమ్ రాక్-జ్యోమ్, క్షిపణుల అధికారి, శాస్త్రవేత్త అయిన కిమ్ జోంగ్-సిక్‌ను ఆయనతోపాటు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

చైనా భూభాగంలో రక్షణ ఏర్పాట్లు
ఒక వేళ అమెరికా ముందుగా దాడిచేస్తే సురక్షితమైన మార్గం ద్వారా తప్పించుకొని చైనా భూభాగంలో కిమ్ తలదాచుకోనున్నారు. అక్కడి నుండే ఉత్తరకొరియా సేనలను నడిపించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. చైనా భూభాగంలోని యాలు నదికి సమీపంలో కిమ్ తలదాచుకోవాలనుకుంటున్న ప్రాంతం ఉంది. కిమ్ తప్పించుకోవడానికి రెండు చిన్న విమానాలను ఎప్పుడూ సిద్ధంగానే ఉంచుకుంటారు. ఈ విమానాలలో ఇంధనం నిండుగా ఉంటుందని బ్రిటిష్‌లో ఉత్తరకొరియా అంబాసిడర్‌గా పని చేసిన మాజీ అధికారి, ఒకప్పుడు కిమ్‌కు మంచి నమ్మకస్తుడైన థానే యోంగ్ హో ఈ విషయాలను తెలిపారు.

అమెరికా దాడి చేస్తే ఊరుకోమన్న చైనా
ప్రస్తుతం ఉత్తరకొరియా ఫిరాయింపుదారుడిగా ఉన్న థానే యోంగ్ హో ఈ రహస్యాలను సీఐఏ, ఎం15 అనే సంస్థలకు వివరించారు. ఇదిలావుండగా అమెరికాపై ఉత్తరకొరియా దాడి చేస్తే తటస్థంగా ఉంటామని చైనా ప్రకటించింది. ఉత్తరకొరియాపై అమెరికా ముందుగా దాడి చేస్తే చూస్తూ ఊరుకోబోమని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో చైనాలో తలదాచుకునేందుకు కిమ్ ఏర్పాటు చేసుకున్నారనే అభిప్రాయాలు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications