ముందే తెలుసు.. ఆ రెండు చోట్ల దాడి చేసే ఛాన్స్, ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

కాల్పుల్లో గాయపడ్డ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోలుకుంటున్నారు. ఇవాళ జనం ముందుకు వచ్చారు. వీల్ ఛైర్‌లో కూర్చొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దాడి గురించి ఆయన మాట్లాడారు. దాడి జరుగుతుందనే విషయం తనకు ఒక రోజు ముందే తెలుసని హాట్ కామెంట్స్ చేశారు.

వజీరాబాద్, గుజ్రాత్‌లో తనను చంపడానికి ప్రణాళిక రచించారని సమాచారం ఉందని ఇమ్రాన్ ఖాన్ వివరించారు. ఇది ప్రణాళికతో జరిగిన దాడి అని.. తన హత్యకు నలుగురు వ్యక్తులు కుట్ర పన్నారని వివరించారు. దీనికి సంబంధించి అన్ని వివరాలతో ఓ వీడియో సిద్ధం చేశానని తెలిపారు. తనకు ఏదైనా అయితే ఆ వీడియో విడుదల చేయమని తనవాళ్లకు చెప్పానని పేర్కొన్నారు.

Knew I was going to be attacked: Imran Khan

కంటైనర్ పై నిల్చొని ఉండగా, ఉన్నట్టుండి కాళ్లకు బుల్లెట్లు తాకాయి. మొత్తం 4 బుల్లెట్లు తగలడంతో పడిపోయానని.. జరిగిన ఘటనను ఇమ్రాన్ ఖాన్ వివరించారు. ఇద్దరు దుండగులు కనిపించారని.. వారిద్దరూ ఒకేసారి కాల్పులు జరిపి ఉంటే తను బతికేవాడిని కాదన్నారు. కాలికి తగిలిన బుల్లెట్ గాయాల ఎక్స్ రే చిత్రాలను డాక్టర్ సాయంతో ప్రదర్శించారు.

గురువారం వజీరాబాద్‌లో జరిగిన ర్యాలీలో దుండగుడు కాల్పులు జరపడంతో.. ఇమ్రాన్ కాలికి గాయమైంది. ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిపిన సమయంలో పట్టుకున్న వ్యక్తిని ఇమ్రాన్ మద్దతుదారులు అభినందించారు. అతనిని వారు తమ భుజంపైకి ఎక్కించుకుని మరీ.. అభినందనలు తెలిపారు. ఆ దుండుగుడిని పట్టుకొని మంచి పనిచేశావు అని అన్నారు. అతను కాల్పులు జరపడం తాను చూశానని.. మరో రౌండ్ కాల్పులు చేయకుండా చూశానని తెలిపారు. ఆ వెంటనే అతను తుపాకీ వదిలేసి పారిపోయాడని.. అతనిని తాను పట్టుకున్నానని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+