షాక్:హిట్లర్ లా సెల్యూట్ చేస్తే, నిషేధం విధించారిలా...
నాజీల నియంత హిట్లర్ మాదిరిగా సెల్యూట్ చేసినందుకుగాను లేబర్ పార్టీకి చెందిన కౌన్సిలర్ పై వేటు పడింది. బడ్జెట్ సమావేశంలో ఆయన ప్రసంగించకుండానే నిషేధం విధించారు. బడ్జెట్ కు ఆమోదం తెలిపారు.
లండన్:నాజీల నియంత హిట్లర్ మాదిరిగా సెల్యూట్ చేసినందుకుగాను ఓ లేబర్ పార్టీకి చెందిన కౌన్సిలర్ పై వేటుపడింది. బడ్జెట్ సమావేశంలో ఆయన ప్రసంగించకుండా కొంత సమయం వరకు ఆయనపై నిషేధం విధించారు.
ఆయన చెప్పాల్సిన అంశాలను చెప్పనీయకుండానే బడ్జెట్ ను ఆమోదించారు. ఈ ఘటన బ్రిటన్ లోని ప్లై మౌత్ నగరంలో చోటుచేసుకొంది. బడ్జెట్ లో భాగంగా ఫ్లై మౌత్ నగరానికి చెందిన ఓ పన్ను విషయంలో భాగంగా చర్చను చేపట్టారు.

దీనికి అటు లేబర్ పార్టీకి చెందిన వారితో పాటు కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు కూడ వచ్చారు. ఇందులోనే జానీ మోరిస్ అనే కౌన్సిలర్ కూడ ఉన్నారు.ఎంతో సీరియస్ గా బడ్జెట్ పై చర్చ జరుగుతుండగా ఉకిప్, టోరి అనే ఇద్దరు కన్జర్వేటివ్ పార్టీకి చెందిన వారిపై చూసి హిట్లర్ మాదిరిగాజానీ మోరిస్ అనే కౌన్సిలర్ సెల్యూట్ చేశారు.
కొన్ని సెకన్లపాటు గాల్లోనే చేతి ఉంచి అనంతరం తీసేశారు. ఈ ఘటనకు కన్జర్వేటివ్ పార్టీలోని ఇయాన్ బోయర్ అనే వ్యక్తి అడ్డు చెప్పాడు. ఇది జాతి వివక్షకు సంబంధించిన సంకేతమంటూ అలాంటి సైగ చేయడం నేరం అవుతోందని అడ్డు పడ్డాడు.
ఆయనపై వేటు వేయాల్సిందేనని పట్టుబట్టాడే.క్షమాపణలు చెప్పించాల్సిందేనని మేయర్ కోరడంతో ఆమె ఆ రకంగా ఆదేశించింది. దీంతో అందరిలో క్షమాపణ చెప్పిన జాని మోరిస్ కు తర్వాత ప్రసంగించే అవకాశం ఇవ్వకుండానే ఆ బిల్లను ఆమోదించారు.












Click it and Unblock the Notifications