Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లాస్‌వెగాస్: అమెరికాకు ఫెడాక్ ప్రియురాలు, యుద్దంలో గాయం లేదు, కానీ..

వాషింగ్టన్: అమెరికాలో లాస్‌వెగాస్‌లో కాల్పులు జరిపి మారణహోమానికి కారణమైన స్టీఫెన్ ఫెడాక్ ప్రియురాలు మరిలౌ డాన్లీ అమెరికాకు తీసుకువచ్చారు పోలీసులు. అయితే ఈ మారణహోమం గురించి తనకు తెలియదని మరిలౌ డాన్లీ ప్రకటించారు.

మూడు రోజుల క్రితం లాస్‌వెగాస్‌లో మ్యూజికల్ నైట్‌పై కాల్పులు జరిపి 58 మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నాడు స్టీఫెన్ ఫెడాక్. ఈ కేసు విచారణలో భాగంగా డాన్లీని ఫిలిప్పీన్స్‌ నుంచి అమెరికాకు అధికారులు రప్పించారు.

అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ) అధికారులతో సమన్వయం చేసుకుని.. ఆమె తిరుగు ప్రయాణాన్ని ఏర్పాటు చేసినట్లు ఫిలిప్పీన్స్‌లోని పోలీసు వర్గాలు తెలిపాయి.

Las Vegas gunman's girlfriend says she didn't know he was planning shooting

అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్‌కు స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి డాన్లీ చేరుకున్నారు. ఆమెను అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ) ప్రతినిధులు కలిసినట్లు సమాచారం. డాన్లీని ఈ కేసులో అనుమానితురాలుగా పరిగణించనప్పటికీ.. ప్యాడాక్‌ ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడన్నదిపై డాన్లీ ద్వారా సమాధానాలు లభించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

డాన్లీని ప్యాడాక్‌ అమెరికా నుంచి పంపించివేశాడా అన్న విషయంపై ఆమెను అధికారులు ప్రశ్నించనున్నారు. ఫిలిప్పీన్స్‌లో పుట్టిన డాన్లీకి ఆస్ట్రేలియా పౌరసత్వం ఉంది. వెగాస్‌ నరమేధానికి రెండు వారాల ముందు ఆమె ఫిలిప్పీన్స్‌ వెళ్లారు. మధ్యలో ఓ సారి హాంకాంగ్‌కు వెళ్లి వచ్చారు.

లాస్ వెగాస్‌ కాల్పుల్లో క్షతగాత్రులైన వారి కోసం రక్తం ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో దాతలు ముందుకు వస్తున్నారు. లాస్‌ వెగాస్‌లోని రక్తనిధి కేంద్రాల ముందు గంటల తరబడి బారులు తీరి రక్తదానం చేస్తున్నారు.

లాస్ వెగాస్‌ మారణకాండ మృతుల్లో అమెరికా మాజీ సైనికుడు క్రిస్టోఫర్‌ రాయ్‌బల్‌ (28) కూడా ఉన్నారు. 2011 నుంచి 2012 అఫ్గానిస్థాన్‌లో సేవలందించిన ఆయన ఆ తర్వాత ఉద్యోగం నుంచి విరమణ పొందారు.

పుట్టిన రోజు వేడుకలను తనతల్లితోకలిసి జరుపుకొనేందుకు రాయ్‌బల్‌ వెగాస్‌కు వచ్చారు. అనూహ్యంగా సంగీత కచేరీలో.. ప్యాడాక్‌ జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. అఫ్గాన్‌లో యుద్ధానికి వెళ్లి కూడా.. గాయలే లేకుండా రాయ్‌బల్‌ తిరిగివచ్చాడు. సంగీత కచేరీకి వెళ్లినప్పుడు మాత్రం ఇంతటి ఘోరం జరిగింది అని రాయ్‌బల్‌ తల్లి డెబ్బీ ఎలెన్‌ వాపోయారు.

తూటా తగిలిన అనుభవం ఎలా ఉంటున్నదానిపై గతంలో ఫేస్‌బుక్‌లో రాయ్‌బల్‌ భావోద్వేగంతో పెట్టిన ఓ పోస్ట్‌ కూడా చాలా మందిని కదిలిస్తోంది.ఇటు ఆయన అంతిమసంస్కారాల నిర్వహణ కోసం గోఫండ్‌మిఅనే విరాళ సేకరణ వెబ్‌సైట్‌లో.. 19 గంటల వ్యవధిలోనే రూ.15లక్షల విరాళాలు నమోదయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+