అతడు ఫోర్న్ సైట్లు చూశాడు, వెల్లడించిన నివేదిక, తప్పునాదికాదు: పెరీజ్

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికాకు చెందిన రామన్ పెరీజ్ అనే ప్రజా ప్రతినిధి ఫైనాన్స్ కమిటీకి కొన్ని కీలకపత్రాలను సమర్పించాడు. అయితే ఈ పత్రాలకు సంబంధించిన స్కీన్ షాట్లలో ఫోర్న్ సైట్లను చూసినట్టు తేలింది.దీంతో ఆయన క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది.

అమెరికాకు చెందిన రోడ్ ఐస్ లాండ్ రాష్ట్రానికి చెందిన నేత రామన్ పెరీజ్. ఆయన ఇటీవల హౌజ్ ఫైనాన్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.ఫైనాన్స్ కమిటీకి కొన్ని కీలక పత్రాలకు సంబందించిన డాక్యుమెంట్లను స్క్రీన్ షాట్లు అందించారు.

Lawmaker mistakenly hands out document with porn references

రామన్ పెరీజ్ ఇచ్చిన స్క్రీన్ షాట్ డాక్యుమెంట్లను ప్రింట్లు తీసిన క్లర్క్ కమిటీ సభ్యులకు అందజేశాడు. అయితే పెరీజ్ టీనేజర్ల ఫోర్న్ సైట్లను ఇతర ట్యాబ్ లలో ఓపెన్ చేసి అసభ్యకర వీడియోలు చూసినట్టు ఇతర నేతలు, కమిటీ సభ్యులు గమనించి ఛైర్మెన్ దృష్టికి తీసుకెళ్ళారని అధికార ప్రతినిధి లార్రీ బెర్మన్ తెలిపారు.

రీసెర్చ్ చేసి నివేదికను ఇవ్వడంలో ఆయన ఏ మాత్రం ఏకాగ్రత వహించారో అర్ధమౌతోందని ఇతర సభ్యులు కామెంట్ చేశారు. దీంతో ఆ నేత నవ్వులపాలయ్యాడు.

చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చేయత్నం చేశాడు రామన్ పెరీజ్. నా పొరపాటు వల్ల డాక్యుమెంట్లో అసభ్యకర విషయాలు వెలుగుచూశాయి. వాస్తవానికి నేను నా ప్రెండ్ కు ఈ పని అప్పగించాను . అతడు చేసిన పని నాకు ఆలస్యంగా అర్ధమైందంటూ పెరీజ్ వివరణ ఇచ్చారు. తనను క్షమించాలని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Rhode Island lawmaker is acknowledging he mistakenly gave his colleagues a handout that showed open web browser tabs referencing pornographic content.State Rep. Ramon Perez brought printouts of a Wikipedia article Wednesday to give to House Finance Committee members as part of his testimony in favor of a bill.
Please Wait while comments are loading...